న్యాయం చేయాలంటూ రోడ్డెక్కిన విద్యార్థినిలు
- పీఈటి ని సస్పెండ్ చేయాలని ట్రైబల్ సోషల్ వెల్ఫేర్ విద్యార్థినులు.
ముద్ర,తంగళ్లపల్లి :-తంగళ్ళపల్లి మండలం ఇందిరమ్మ కాలనీలో ఉన్న ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలోని విద్యార్థినిలు ఉదయం 5 గంటలకు సిరిసిల్ల సిద్దిపేట ప్రధాన రహదారి బద్దెనపల్లి పై కూర్చొని పిఈ టీ జ్యోత్స్న ను సస్పెండ్ చేయాలని ఆందోళన చేపట్టారు.విద్యార్థినులకు నెలవారి పీరియడ్ ఉన్న సమయంలో బాత్రూంలో స్నానం చేస్తున్న సమయంలో ఆలస్యం ఎందుకు అవుతుందని డోర్ పగలగొట్టి లోనికి వచ్చి తన చరవాణి తో వీడియో రికార్డు చేస్తూ కొడుతున్న జ్యోష్ణ అనే పిఈ టి టీచర్.పీఈ టి జ్యోత్స్నా విద్యార్తినులను పెట్టె ఇబ్బందులు భరించలేక సిరిసిల్ల - సిద్దిపేట ప్రధాన రహదారి పై ధర్నాకు దిగమని విద్యార్థినిలు తెలిపారు.ధర్నా చేస్తున్న స్థలానికి చేరుకున్న మండల ఎంఈఓ రఘుపతి, ఎస్ఐ సుధాకర్ చేరుకొని జ్యోత్న ను విధుల నుండి సస్పెండ్ చేసిన డీఈఓ రమేష్ కుమార్.అనంతరం ఆందోళన విరమించి కాలేజీకి వెళ్లిన విద్యార్థినిలు.