నీట్ లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు

నీట్ లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు

ముద్ర.వీపనగండ్ల:- వీపనగండ్ల గ్రామానికి చెందిన ముగ్గురు విద్యార్థులు నీట్ పరీక్ష ఫలితాలలో తమ ప్రతిభను చాటారు. వీపనగండ్ల గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు జోళ్లు గంగన్న శ్యామల కుమారుడు అఖిల్ 720 మార్కులకు గాను 645 మార్కులు, మేడిపల్లి నాగేశ్వర్ రెడ్డి శ్వేత కుమార్తె యామిని రెడ్డి 568 మార్కులు, మునిగొండ గోపి మాధవి కుమార్తె అఖిల 444 మార్కులు సాధించి ఎంబిబిఎస్ లో సీటు పొందటానికి అర్హత సాధించారు. విద్యార్థులు నీట్ లో మంచి మార్కులతో ప్రతిభ చూపడం ఆనందంగా ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. గత మూడు సంవత్సరాలుగా వీపనగండ్లకు చెందిన పలువురు విద్యార్థులు నీట్ పరీక్షలో ప్రతిభ కనపరుస్తూ రాష్ట్రంలోని పలు ప్రభుత్వ మెడికల్ కాలేజీలలో సీట్లు సాధించడం గ్రామానికి గర్వకారణంగా ఉందని గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నీట్ లో ప్రతిభ కనబరిచిన ముగ్గురు విద్యార్థులను ప్రజా ప్రతినిధులుఅధికారులు గ్రామస్తులు అభినందించారు.