చందుపట్ల లో సుబ్బురు సత్తయ్య అంత్యక్రియలు.. హాజరైన ప్రముఖులు.

చందుపట్ల లో సుబ్బురు సత్తయ్య అంత్యక్రియలు..  హాజరైన ప్రముఖులు.

ముద్ర ప్రతినిధి భువనగిరి : ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య సతీమణి బీర్ల అనిత తండ్రి సుబ్బురు సత్తయ్య అనారోగ్యంతో మృతిచెందారు. ఆదివారం ఉదయం భువనగిరి మండలం చందుపట్ల గ్రామంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. ఈ అంత్యక్రియలకు రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎమ్మెల్యేలు కుంభం అనిల్ కుమార్ రెడ్డి, మందుల సామేల్, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, ఎంపి అభ్యర్థులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, క్యామ మల్లేష్, బండ్రు శోభారాణి సత్తయ్యకు నివాళులర్పించారు. ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

తండ్రికి తలకురివి పెట్టిన ఎమ్మెల్యే సతీమణి

ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య సతీమణి బీర్ల అనిత పితృమూర్తి సత్తయ్య శనివారం సాయంత్రం ఆకస్మిక మరణం పొందారు ఆయన అంత్యక్రియలు జరిపేందుకు కుమారులు లేకపోవడంతో ఎమ్మెల్యే సతీమణి అనిత తండ్రికి తలకొరివి పెట్టారు.