ఘనంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం 

ఘనంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం 

ముద్ర, షాద్‌నగర్:-శ్రీకృష్ణ పీఠాధిపతి శ్రీ కృష్ణ జ్యోతి సర్వపానంద స్వామి ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి శ్రీ వల్లి దేవ సేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది. షాద్ నగర్ శ్రీ బాలాజీ టౌన్షిప్ ఎదురుగా కొనసాగుతున్న అయుత చండీ అతి రుద్రం 81 వ విశ్వశాంతి మహా యాగం లో భాగంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. అలాగే శ్రీ అభయాంజనేయ స్వామి కి లక్ష తమలపాకుల అర్చన కార్యక్రమాన్ని కన్నుల పండుగగా కొనసాగించారు. స్వామి కళ్యాణోత్సవాన్ని పురస్కరించుకొని చిన్నారులు చేసిన నృత్య ప్రదర్శనలు అమితంగా ఆకట్టుకున్నాయి.

వేలాదిగా తరలివచ్చిన భక్తులను శ్రీ కృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామి ఆశీర్వదించారు. బుధవారం గణపతి అధర్వ శీర్ష సహిత అష్టగణపతి పూజలు, సామూహిక చండీ హోమాలు, కుంకుమార్చనలు కొనసాగాయి. వేలాదిగా తరలివచ్చిన భక్తులు యాగశాలల చుట్టూ ప్రదర్శనలు చేసి స్వామి ఆశీర్వాదం పొందారు. అనంతరం భక్తులందరికీ అన్నదాన కార్యక్రమం కొనసాగింది. 650 మంది ఋత్వికులచే విశ్వశాంతి కోసం నిర్వహిస్తున్న మహాయాగం ఎంతో ఖర్చుతో కూడుకున్నదని భక్తులు, దాతలు ముందుకు వచ్చి మహాకార్యాన్ని విజయవంతం చేయాలని శ్రీకృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామీజీ పిలుపునిచ్చారు.