ఆర్య వైశ్యుల ఆత్మీయ సమ్మేళనం ను విజయవంతం చేయండి

ముద్ర ప్రతినిధి సూర్యాపేట:-ఈనెల 26 న సూర్యాపేట జిల్లా కేంద్రంలోనీ సుమంగళి ఫంక్షన్ హాల్లో సాయంత్రం 6 గంటలకు జరుగు ఆర్యవైశ్యుల ఆత్మీయ సమ్మేళనం ను విజయవంతం చేయాలని ఆర్యవైశ్యుల సమ్మేళన ఆహ్వాన కమిటీ సభ్యులు తెలియజేశారు. సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బి.ఆర్.ఏస్. పార్టి కార్యాలయము లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలువురు మాట్లాడుతూ గత 10 ఎండ్లుగా సూర్యాపేట లో వ్యాపారస్తులు స్వేచ్ఛగా వ్యాపారాలు చేసుకుంటు జీవనం కొనసాగిస్తున్నారని, దానికి మంత్రి జగదీష్ రెడ్డిసహకారం మరువలేనిది అని అన్నారు. ఆర్యవైశ్యుల భవనం కొరకు ఎకరం స్థలం తో పాటు భవన నిర్మాణం కోసం 2 కోట్ల రూపాయలు నిధులు కేటాయించారని కొనియాడారు.వారిని మళ్ళీ గెలిపించుకోవాలసిన బాధ్యత ప్రతి ఒక్క ఆర్య వైశ్యునకు ఉందని తెలిపారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా సూర్యాపేట బి. ఆర్.ఏస్. పార్టీ అభ్యర్ధి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి వస్తున్నారని, పార్టీల కతీతంగా ఈ ఆత్మీయ సమ్మేళనం లో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బి.ఆర్.ఏస్.పార్టీ పట్టణ అధ్యక్షులు సవరాలసత్యనారాయణ, ఆర్యవైశ్య సంఘం నాయకులు ఉప్పల ఆనంద్,బండారు రాజా, వెంపటి సురేష్, బొమ్మిడి లక్ష్మీ నారాయణ సింగిరికొండ రవీందర్,తోట శ్యామ్ ప్రసాద్,ఉప్పల సంపత్ కుమార్, రాచర్ల కమలాకర్,చల్లా లక్ష్మీకాంత్, చల్లా లక్ష్మీప్రసాద్, మీలా వంశీ, కలకోట లక్ష్మయ్య, దేవరశెట్టి సత్యనారాయణ,ఓరుగంటి శ్రీకాంత్, పాలవరపు వేణు,శిలా శంకర్,పసుమర్తి కృష్ణమూర్తి తది తరులు పాల్గోన్నారు.