రేపటి రేవంత్ సభను విజయవంతం చేయాలి: కాంగ్రెస్ నేతలు

రేపటి రేవంత్ సభను విజయవంతం చేయాలి: కాంగ్రెస్ నేతలు
Success the Revanth meeting Congress leaders

ముద్ర ప్రతినిధి, ఖమ్మం: టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి ప్రారంభించిన హత్ సే హత్ యాత్ర ను విజయవంతం చేయాలని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్, రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు సుంకేట అన్వేష్ రెడ్డి కోరారు. గురువారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవనంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడారు. రేవంత్ యాత్ర మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గం లో పూర్తి చేసుకుని ఇల్లందు నియోజకవర్గ లోని ఖమ్మం జిల్లా కామేపల్లి మండలానికి గురువారము రాత్రి  చేరుకుని, శుక్రవారము  లచ్చు తండా నుండి పాద యాత్ర ప్రారంభమై బర్ల గూడెం, పొన్నేకల్లు,బండిపాడు, బంజర,  గోవింద్రాల,పాత లింగాల, మీదుగా సాగుతూ కొత్త లింగాల క్రాస్ రోడ్ లో సాయంత్రం బహిరంగ సభ జరుగుతుందని చెప్పారు.

ఖమ్మం జిల్లా నలుమూలల నుండి కాంగ్రెస్ శ్రేణులు, అన్ని అనుబంధ సంఘాల నాయకులు, మహిళా, విద్యార్థి, యువజన విభాగం, మైనార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరూ పాల్గొని రేవంత్ రెడ్డి యాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. నగర కాంగ్రెస్ అధ్యక్షులు, మహమ్మద్ జావిద్, జిల్లా కాంగ్రెస్ నాయకులు రాయల నాగేశ్వరరావు,  వైరా పీసీసీ సభ్యులు నారాయణ రావు, ఎస్సీ సెల్ అధ్యక్షులు  బొందయ్య, జిల్లా మైనార్టీ నాయకులు హుస్సేన్, ఏలూరి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.