రేవంత్ రెడ్డిని కలిసి పుష్పగుచ్చం అందజేస్తున్న సూర్యాపేట కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్

రేవంత్ రెడ్డిని కలిసి పుష్పగుచ్చం అందజేస్తున్న సూర్యాపేట కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్
  • భువనగిరి పార్లమెంట్ టికెట్ కోసం తీవ్ర ప్రయత్నం చేస్తున్న చెవిటి

తుంగతుర్తి ముద్ర:- పార్లమెంట్ ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో సూర్యాపేట డిసిసి అధ్యక్షుడు సీనియర్ కాంగ్రెస్ నాయకుడు చెవిటి వెంకన్న యాదవ్ హైదరాబాదులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి పుష్పగుచ్చమంద చేశారు. భువనగిరి పార్లమెంటు స్థానం నుండి పోటీ చేయడానికి చెవిటి వెంకన్న యాదవ్   తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. ఈనెల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశీస్సులు పొంది భువనగిరి పార్లమెంటు స్థానానికి మార్గం సుగమం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు అలాగే ఇటీవలనే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సైతం చెవిటి వెంకన్న యాదవ్ కలిశారు. ఏది ఏమైనా ఈసారి ఎన్నికల్లో భువనగిరి పార్లమెంట్ అభ్యర్థిగా బీసీ సామాజిక వర్గం నుండి తనను ఎంపిక చేయాలని కాంగ్రెస్ అధిష్టానాన్ని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలను ముఖ్య నాయకులను చెవిటి వెంకన్న యాదవ్ అభ్యర్థిస్తున్నట్లు సమాచారం.