అవ్వల వద్దకే అధికారి
సూర్యాపేట ముద్ర ప్రతినిధి :-అవ్వా నీకు వందనం... మానవ ప్రపంచ నిర్మాతలైన కన్నతల్లులారా మీకు పాదాభివందనం...!
అవ్వల తో ఆప్యాయంగా...
ఇంటి ముందర మెట్లపై అవ్వలతో పాటు కూర్చుని...
బువ్వ తిన్నారా అంటూ
యోగక్షేమ సమాచారాలు అడిగి తెలుసుకుంటున్న స్పందించే మానవత హృదయం ...
అధికార దర్పం ..హంగు... పొంగు... ఆర్భాటం ఏమీ లేకుండా...
ఒక సామాన్య వ్యక్తి లాగా... సాధారణ మనిషి లాగా....అతి సాధారణ కన్న బిడ్డ లాగా...
నా కన్నబిడ్డ నా ఇంటికి వచ్చిండా అన్న ఉద్విగ్న క్షణాలను తలపిస్తూ....
కన్న కొడుకులు బతుకు పోరాటంలో ఇతర ప్రాంతాలకు వెళ్లడంతో ప్రస్తుతం తన దగ్గర లేని లోటును మరిపిస్తూ...
అవ్వలను మురిపిస్తూ... అనురాగ.. ఆప్యాయతలు కురిపిస్తూ...
ఖాకి బట్టల మాటున ఉంటున్నాయనుకునే అధికార దర్పం... కాటిణ్యత...కఠినత్వం... బేషజాలను పక్కన పెట్టి...
విధి నిర్వహణలో ఎంతో అవిశ్రాంతంగా ఉన్నప్పటికీ...
అంతరించిపోతున్న మానవ సంబంధాలను గుర్తుకు తెచ్చేలా...
అంతరాల దొంతరలు లేని సమాజాన్ని స్వాగతిస్తూ....
అవ్వలను పలకరించి... అవ్వా బిడ్డల కన్న పేగు బంధాన్ని కలగలుపుతూ పలవరించి...
తమ సంతానాన్ని తడిమి చూసుకుని... తనివితీరా ఆస్వాదించే మాతృత్వపు మధుర క్షణాలను గుర్తు చేస్తూ....!
అవ్వల కన్నుల్లో కన్నకొడుకే వచ్చిండా అన్న సంతోషాన్ని.... సంభ్రమాశ్చర్యాలను.... మెరిపించి
ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండమనే తత్వాన్ని అలవర్చుకుని.....
అవ్వల జీవిత అనుభవాలను... కష్టనష్టాలను... జీవిత సారాన్ని ప్రశాంతంగా వింటూ....
నాటి గ్రామీణ ప్రాంతంలోని ఇలాంటి వృద్ధ తల్లిదండ్రులే నేటి తమ సంతానానికి దిక్సూచిలా... మార్గదర్శకులుగా.... ఒక ఫిలాసఫర్ గా.... వెన్ను తట్టి ప్రోత్సహించే జీవితానుభవ యోధులుగా ఉంటున్నారని అంతరించి పోతున్న వృద్ధ తరాలను ప్రశంసిస్తూ...
చావుకు ఎదురుచూస్తూ ఉన్న పండు టాకుల ఎండిన జీవితాల .....
జీవిత చరమాంకపు కథలను... వ్యధలను... ఓర్పుగా వింటూ నేర్పుగా వ్యవహరించి ....
వారిలో మనోధైర్యాన్నిచ్చి.... మానసిక ఉల్లాసాన్ని పెంచి... ఉన్న కొద్దిసేపు అయినా ఉల్లాసాన్ని నింపి ....
గుప్త దానాలు ఎన్నో గుట్టుగా చేస్తూ.... చేయూతనిచ్చి.... పేదల బాధలు తెలిసిన బహుదూరపు బాటసారి.... వృద్ధుల జీవితాలకు వెలుగు దారి...హ్యాట్సాఫ్ టు యు....!
అవ్వల సాన్నిత్యంలో గువ్వలా ఒదిగిన అజాతశత్రువు ...ఆపన్న హస్తం... నిగర్వి... నిష్కలంకుడు....సూర్యాపేట డిఎస్పి గొల్లూరి రవి..... నీకు ఇవే మా వినమ్ర పూర్వక మానవత్వపు వందనాలు.... అభివందనాలు...
(ఒక కేసు విచారణ విషయమై సూర్యాపేట డిఎస్పి గొల్లూరి రవి అడివెంల గ్రామం వెళ్లిన సందర్భంగా జరిగిన యదార్ధ సంఘటన ఆధారంగా)