తిరుగుబాటుకు సూర్యాపేటే పునాది

తిరుగుబాటుకు సూర్యాపేటే పునాది
  • నిజాంకు వ్యతిరేకంగా ఉద్యమం మొదలైంది ఇక్కడే
  • ప్రశాంతతను చెడగొదుతున్న వారిపై తిరుగుబాటుకు వ్యాపారులు సన్నద్ధం కావాలి
  • ఫ్యూడలిజానికి నేను బద్ధ వ్యతిరేఖిని 
  • ఫ్యూడలిజం అభివృద్ధిని నిరోధిస్తుంది
  • దశాబ్దకాలంగా అభివృద్ధి పైనే దృష్టి సారించా 
  • మున్సిపల్ కౌన్సిలర్లు రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి పై దృష్టి సారించాలి
  • దాడుల సంస్కృతి ప్రగతికి గొడ్డలి పెట్టు
  • దామోదర్ రెడ్డి ఇప్పటికైనా ఇది గ్రహించాలి 
  • గండూరీ పావని కృపాకర్ పై జరిగిన దాడిని ప్రజాస్వామ్య వాదులు నిర్ద్వంద్వంగా ఖండించాలి 
  • కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో మున్సిపల్ చైర్మన్ అన్నపూర్ణమ్మ అందించిన సేవలు శ్లాఘ నీయం
  • గడిచిన ఐదు సంవత్సరాలలో సాధించిన జాతీయ అవార్డులు ఇందుకు తార్కాణం
  • అటువంటి దళిత మహిళా మున్సిపల్ చైర్మన్ పై జరిగిన దాడి ప్రజాస్వామ్యానికి విఘాతం
  • జెనరల్ స్థానంలో దళిత మహిళకు గులాబీ పార్టీ పెద్ద పీట వేసింది
  • ఆమె నేతృత్వంలో సూర్యాపేట పురపాలక సంఘం సాధించిన అభివృద్ధి జాతీయ స్థాయిలో ఆదర్శంగా నిలిచింది
  • జరిగిన తప్పును సరిదిద్దుకుని కౌన్సిలర్లు అభివృద్ధికి సహకరించాలి 
  •  మాజీ మంత్రి జగదీష్ రెడ్డి

ముద్ర ప్రతినిధి సూర్యాపేట:-ప్రజల సమస్యలపై మొట్టమొదటి సారిగా తిరుగుబావుటా మొదలైంది సూర్యాపేట నుండే ఆన్న విషయాన్ని పాలక పక్షం గుర్తెరిగి మసులు కోవాలని మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. నైజాం అంతటి నియంతృత్వ పాలకులకు వ్యతిరేకంగా ఉద్యమం మొదలైంది ఈ గడ్డ మీద నుండే అన్న విషయాన్ని పాలకులు విస్మరించ రాదని ఆయన హెచ్చరించారు. సూర్యాపేట పురపాలక సంఘం పరిధిలో మున్సిపల్ చైర్మన్ పెరుమాండ్ల అన్నపూర్ణమ్మ కు వ్యతిరేకంగా జరిగిన అవిశ్వాస తీర్మానాన్ని వ్యతిరేకకిస్తూ ఓటింగ్ కు దూరంగా ఉన్న గండూరీ పావని కృపాకర్ ఇంటిపై జరిగిన దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. ఆ దాడిని అడ్డుకున్న మున్సిపల్ చైర్మన్ దళిత మహిళ అన్నపూర్ణమ్మ పై జరిగిన దాడి ప్రజాస్వామ్యం పై జరిగిన దాడిగా ఆయన అభివర్ణించారు.

ఈ మేరకు ఆదివారం రాత్రి సూర్యాపేటలో పావని కృపాకర్ నివాసంలో వారిని పరామర్శించి ధైర్యం చెప్పారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన సూర్యాపేటలో దశాబ్దకాలంగా కొనసాగుతున్న ప్రశాంతతను  చెడగొడుతున్న దుష్టశక్తులపై తిరుగుబాటు చేయాలల్సిన సమయం ఆసన్నమైందని జగదీష్ రెడ్డి పిలుపునిచ్చారు. అందులో వ్యాపారులు భాగస్వామ్యం కావాలని ఆయన పేర్కొన్నారు. మంత్రిగా సూర్యాపేట పట్టణంలో దశాబ్ద కాలంగా ప్రశాంతత సాదించానన్నారు.అది నాకు తీరని తృప్తి కలిగించిందని ఆయన చెప్పారు. మున్సిపల్ కౌన్సిలర్లు రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి పై దృష్టి సారించాలని జగదీష్ రెడ్డి హితవుపలికారు. దాడుల సంస్కృతి ప్రగతికి గొడ్డలి పెట్టులా మారుతుందన్న విషయాన్ని ప్రజలు,ప్రజాస్వామిక వాదులు, వర్తక వాణిజ్యా వర్గాలు ఆలోచించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.ఇటువంటి సునిషితమైన అంశాన్ని దామోదర్ రెడ్డి వంటి వారు విజ్ఞత ఆలోచన చెయ్యాలని ఆయన ఉపదేశించారు.కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో మున్సిపల్ చైర్మన్ గా ఉన్న పెరుమాండ్ల అన్నపూర్ణమ్మ అందించిన సేవలు శ్లాఘనియమన్నారు.యావత్ భారత దేశానికి సూర్యాపేట పురపాలక సంఘం ఆదర్శంగా నిలబడిందన్నారు.జాతీయ స్థాయిలో సూర్యాపేట పురపాలక సంఘానికి వచ్చిన అవార్డులు అందుకు తర్కాణమని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికైనా జరిగిన తప్పును సరిదిద్దుకుని పట్టణ అభివృద్ధి లో కౌన్సిలర్లు భాగస్వామ్యం కావాలని మాజీ మంత్రి జగదీష్ రెడ్ది ఉపదేశించారు.