ఉపాధ్యాయుడి సస్పెన్షన్ - ప్రధానోపాధ్యాయునికి మెమో 

ఉపాధ్యాయుడి సస్పెన్షన్ - ప్రధానోపాధ్యాయునికి మెమో 

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లా కుబీర్ మండలం పల్సి ఉన్నత పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న కే. సాగర్ అనే ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి డా. ఏ. రవీందర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థినుల  పట్ల  ఆయన గత కొంతకాలంగా అసభ్యంగా ప్రవర్తించినట్లు వచ్చిన ఆరోపణల ఆధారంగా నిర్మల్ జిల్లా సంక్షేమాధికారి విచారణ నివేదిక,మండల విద్యాధికారి ప్రాథమిక నివేదిక ఆధారంగా సాగర్ ను సస్పెండ్  చేసినట్లు ఆయన తెలిపారు.  విధులలో నిర్లక్ష్యం వహించి,  సరిగా పర్యవేక్షణ చేయని కారణంగా ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సురేష్ కు షోకాజ్  నోటీసు అందజేశారు. తదుపరి చర్యల నిమిత్తం వరంగల్ ఆర్ జె డి కి నివేదిక పంపామని ఆయన తెలిపారు.