లైంగిక వేధింపుల ఆరోపణలతో టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం సస్పెన్షన్‌

లైంగిక వేధింపుల ఆరోపణలతో టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం సస్పెన్షన్‌

మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంను టీడీపీ అధిష్టానం సస్పెన్షన్‌ చేసినట్టు ప్రకటించింది. లైంగిక వేధింపుల ఆరోపణల దరిమిలా అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుంది. గురువారం హైదరాబాద్‌లో బాధితురాలు మీడియా సమావేశంలో సత్యవేడు ఎమ్మెల్యే లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపణలు చేసింది. దీనిపై వెంటనే స్పందించిన టీడీపీ అధిష్టానం కొన్ని గంటల్లోనే ఆయనపై యాక్షన్‌ తీసుకున్నట్లు ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌రావు వెల్లడించారు.