నా జీవితం కాంగ్రెస్ పార్టీకి, సూర్యాపేట ప్రజలకు అంకితం. 

నా జీవితం కాంగ్రెస్ పార్టీకి, సూర్యాపేట ప్రజలకు అంకితం. 
  • పార్టీ మారుతున్నట్లు నా పై జరుగుతున్న రాజకీయ దుష్ప్రచారాన్నీ ఖండిస్తున్నా
  • విలేకరుల సమావేశంలో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి

ముద్ర ప్రతినిధి సూర్యాపేట:-తన జీవితం కాంగ్రెస్ పార్టీకి సూర్యాపేట ప్రజలకు అంకితం అని, తన రాజకీయ ప్రత్యర్ధులు  ఎదుగుదలను ఓర్వలేకనే నాపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి చెప్పారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని తన నివాసంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పార్టీ మారుతున్నట్లు తనపై జరుగుతున్న రాజకీయ దుష్ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.

నన్ను బదనాం చేసే చర్యలు ప్రత్యర్థులు మానుకోవాలని ఆయన హితవు పలికారు.పార్టీ మార్పు ప్రచారం ప్రత్యర్థుల కుట్ర మాత్రమే అని స్పష్టం చేశారు.కొన్ని మీడియాల్లో వ్యతిరేక వార్తలు వస్తున్నాయని,ఎలాంటి కారణాలు చూపకుండా వార్తలు రాస్తున్న వారిపై పరువు నష్ట దావా వేస్తానని హెచ్చరించారు.తన రాజకీయ ప్రయాణం తెరిచిన పుస్తకం ఆని వెల్లడించారు.ఎమ్మెల్యే టికెట్ ఆశించినప్పుడు పార్లమెంట్ టికెట్ పై హామీ ఇచ్చారని గుర్తు చేశారు.పార్టీ నిర్ణయం బాధగా ఉన్నా అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని హామీ ఇచ్చారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన  చిన్ననాటి మిత్రుడు ఆని, ఆయనకు నా పూర్తి మద్దతు ఉంటుందన్నారు.

చివరి శ్వాస వరకు కాంగ్రెస్ పార్టీతోనే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తోనే  ఉంటానని కుండబద్దలు కొట్టారు.ఏ పార్టీలు నన్ను సంప్రదించలేదని, ఆ ధైర్యం ఎవరికి లేదన్నారు.నల్లగొండ లోక్ సభ టికెట్ పై నాతో అధిష్టానం సంప్రదింపులు జరిపిందన్నారు.నాకు సముచిత స్థానం కల్పిస్తామని ఏఐసీసీ, పీసీసీ నుండి స్పష్టమైన హామీ ఉందన్నారు. ఈ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ మాజీ మార్కెట్ చైర్మన్ పెద్దిరెడ్డి రాజా, గోదల రంగారెడ్డి, కౌన్సిలర్ షఫీవుల్లా, వెలుగు వెంకన్న, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గట్టు శ్రీనివాస్, యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు ఫారూఖ్, చింతమల్ల దేవేందర్, మాజీ కౌన్సిలర్ తండు శ్రీనివాస్ గౌడ్, స్వామి నాయుడు, పిల్లల రమేష్ నాయుడు, లింగస్వామి, యాట ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.