బదిలీ ఉపాధ్యాయుల పూర్తి వేతనం కొత్త పాఠశాలల్లో చెల్లించాలి  -టియుటిఎఫ్

బదిలీ ఉపాధ్యాయుల పూర్తి వేతనం కొత్త పాఠశాలల్లో చెల్లించాలి  -టియుటిఎఫ్

ముద్ర ప్రతినిధి, నిర్మల్:ఇటీవల బదిలీ అయిన స్కూల్ అసిస్టెంట్ల అక్టోబర్ పూర్తి వేతనం కొత్త పాఠశాలలో చెల్లించేలా చర్యలు చేపట్టాలని జిల్లా సహాయ ట్రెజరీ అధికారి గంగాధరయ్య కు తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టియుటిఎఫ్)వినతి పత్రాన్ని మంగళవారం అందజేసింది.బదిలీ అయిన స్కూల్ అసిస్టెంట్లు ఈనెల 2, 8 తేదీల్లో  విడుదల అయ్యారని, మరుసటి రోజున కొత్త పాఠశాలలో చేరారని పేర్కొన్నారు. రెండు పాఠశాలలో విడివిడిగా బిల్లులు చేయడం వల్ల వేతనాల్లో జాప్యం జరుగుతుందని వివరించారు.ఈ కార్యక్రమంలో సబ్ ట్రెజరీ  అధికారి విద్యాసాగర్, సంఘ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు ఎ.మురళి మనోహర్ రెడ్డి, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు లక్ష్మీప్రసాద్ రెడ్డి, తోడిశెట్టి రవికాంత్, నాయకులు బలిరాం తదితరులు పాల్గొన్నారు.