మిషన్ భగీరథ గుత్తేదారు పై చర్యలు తీసుకోండి 

మిషన్ భగీరథ గుత్తేదారు పై చర్యలు తీసుకోండి 

 జిల్లా కలెక్టర్ కు గ్రామ యువకుడు ఫిర్యాదు 
ముద్ర,రాయికల్ : రాయికల్ మండలంలోని కుమ్మరి పల్లి గ్రామంలో  మిషన్ భగీరథ పథకం నిరుపయోగంగా మారిందని ఇట్టి విషయం పై మిషన్ భగీరథ  అధికారులను అనేక సార్లు చరవాణి ద్వారా విజ్ఞప్తి చేసిన ఎలాంటి చర్యలు తీసుకోనందువలన సమాచార హక్కు చట్టం ద్వారా సమాచారం అడిగితే నీరు వస్తుంది అని తప్పుడు సమాచారం ఇచ్చిన అధికారులపై జిల్లా కలెక్టర్ కి ఫి ర్యాదు చేశానని కుమ్మరిపల్లి గ్రామ యువకుడు  శ్రీను తెలిపాడు.ప్రభుత్వం మిషన్ భగీరథ పథకం ప్రవేశపెట్టినప్పటి నుండి గ్రామంలో ఒక్క నీటి చుక్క కూడా మిషన్ భగీరథ ద్వారా రాలేదని,గతంలో మాదిరిగానే గ్రామ పంచాయితీ ద్వారా మాత్రమే నీరు వస్తుందని, కోట్లాది రూపాయల ప్రజాధనం నిష్ప్రయోజనం చేసిన సంబంధిత గుత్తేదారు పై తగు చర్యలు తీసుకోవలసిందిగా కోరడం జరిగింది.