మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరణ 

మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరణ 

ముద్ర ప్రతినిధి సూర్యాపేట:- సూర్యాపేట మున్సిపల్ కమిషనర్ గా  బి శ్రీనివాస్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. మున్సిపాలిటీని అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు చైర్ పర్సన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, సిబ్బంది సహకరించాలని కోరారు. మున్సిపాలిటీలో నెలకొన్న సమస్యలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అందరూ బాధ్యతతో పనిచేయాలని అన్నారు. తదుపరి సూర్యాపేట జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావును మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.