కేన్సర్‌కు మందు కనుగొన్న టాటా ఇన్‌స్టిట్యూట్..!

కేన్సర్‌కు మందు కనుగొన్న టాటా ఇన్‌స్టిట్యూట్..!

ముద్ర,సెంట్రల్ డెస్క్:-ముంబైకి చెందిన టాటా ఇన్‌స్టిట్యూట్ కేన్సర్ చికిత్సలో కీలక ముందడుగు వేసింది. ఒకసారి కేన్సర్ బారిన పడి కోలుకున్న వారికి రెండోసారి కేన్సర్ రాకుండా నిరోధించే ట్యాబ్లెట్‌ను రూపొందించినట్లు టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ ప్రకటించింది. ఈ కేన్సర్ ఔషధాన్ని కనుగొనడం కోసం పదేళ్లపాటు పరిశోధనలు చేసి, చివరకు విజయం సాధించామని టాటా ఇన్‌స్టిట్యూట్‌ పరిశోధకులు, డాక్టర్లు తెలిపారు.

ఈ ట్యాబ్లెట్ కేన్సర్ ట్రీట్‌‌మెంట్ దుష్ప్రభావాలను 50 శాతం వరకు తగ్గించడంతోపాటు.. రెండోసారి కేన్సర్ రాకుండా అడ్డుకోవడంలో 30 శాతానికిపైగా ప్రభావవంతంగా పని చేస్తుంది. పాంక్రియాస్, లంగ్స్, ఓరల్ కేన్సర్‌పైనా ఇది సమర్థవంతంగా పని చేస్తుంది అని టాటా ఇన్‌స్టిట్యూట్ పరిశోధకులు వెల్లడించారు.