ప్రజాయుద్ధనౌక గద్దరన్నకు ఉపాధ్యాయుల ఘన నివాళులు

ప్రజాయుద్ధనౌక గద్దరన్నకు ఉపాధ్యాయుల ఘన నివాళులు

ముద్ర ప్రతినిధి భువనగిరి : ప్రజాయుద్ధనౌక గద్దరన్నకు యుఎస్పీసి ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఘన నివాళులు అర్పించారు. మంగళవారం రామన్నపేట మండల కేంద్రం లో జరిగిన ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ప్రజా సమస్యలు, తెలంగాణ సాధన కొరకు నిరంతరం తన ఆట పాటల ద్వారా ప్రజలను చైతన్యపరిచారని చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు బోయ రాములు, కంచి రవికుమార్, ఎం.వెంకటరెడ్డి, సిలువేరు అనిల్ కుమార్, బొక్క వెంకట్ రెడ్డి, కట్ట కృష్ణ, లింగయ్య, కట్ట మల్లయ్య, కిషన్,ఎస్ కృష్ణయ్య,లలిత, శ్రీదేవి, విద్యా రాణి, అనురాధ పాల్గొన్నారు.