తెలంగాణ వ్యవసాయ, రైతు సంక్షేమ సంస్థ చైర్మన్ శ్రీ కోదండ రెడ్డి సాధ్యంలో అగ్రీ ఆర్టికల్స్ సొసైటీ హైదరాబాద్(AHS ) నిర్వహిణలో జాతీయ రైతు మహోత్సవం - 2025

తెలంగాణ వ్యవసాయ, రైతు సంక్షేమ సంస్థ చైర్మన్ శ్రీ కోదండ రెడ్డి సాధ్యంలో అగ్రీ ఆర్టికల్స్ సొసైటీ హైదరాబాద్(AHS ) నిర్వహిణలో జాతీయ రైతు మహోత్సవం - 2025

అగ్రి హార్టికల్చర్ సొసైటీ హైదరాబాద్ ఉపాధ్యక్షులు శ్రీ రంగారెడ్డి  ఆధ్వర్యంలో  తెలంగాణ వ్యవసాయ, రైతు సంక్షేమ సంస్థ చైర్మన్ శ్రీ కోదండ రెడ్డి కలిసిన అగ్రి హార్టికల్చర్ సొసైటీ ప్రతినిధులు. ఏ హెచ్ ఎస్ ఆధ్వర్యంలో  నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ మరియు ఏరువాక ఫౌండేషన్ వారి సహకారంతో మార్చి 7, 8 మరియు 9 తేదీల్లో హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నిర్వహించదలచిన జాతీయ రైతు మహోత్సవం - 2025 సదస్సు గురించి కోదండ రెడ్డి  వివరించి ఈ యొక్క రైతు మహోత్సవమునకు సారధ్యం వహించవలసిందిగా కోరినారు. దానికి కోదండ రెడ్డి  సానుకూలంగా స్పందించి సారధ్యం వహించటానికి అంగీకరించారు.

జాతీయ రైతు మహోత్సవ 2025 దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా వ్యవసాయానికి వ్యవసాయ మరియు అనుబంధ రంగాలకు సంబంధించిన అన్ని విభాగాలను కలిపి ఒకే చోట చేర్చి రైతులకు సమగ్ర సమాచారాన్ని అందుబాటులో ఉంచే విధంగా వ్యవసాయ మరియు అనుబంధ రంగాలకు చెందిన కంపెనీలను ఆహ్వానించి అతి పెద్ద ఎగ్జిబిషన్ ను నిర్వహించడానికి అన్ని ప్రయత్నాలను చేస్తున్నట్లు ప్రతినిధులు తెలియజేశారు. ఈ జాతీయ రైతు సదస్సులో ఎగ్జిబిషన్ తో పాటు వ్యవసాయ తదితర రంగాలకు సంబంధించిన కంపెనీల ఎగ్జిబిషన్ తో పాటు రైతులకు ఉపయోగపడే విధంగా నిష్ణాతులైన వివిధ విభాగాల నిపుణులతో సెమినార్లు, చర్చా వేదికలు, వర్క్ షాప్ లు కూడా నిర్వహిస్తున్నామని తెలియజేశారు, సేంద్రియ వ్యవసాయ పద్ధతులు వాటి ఉత్పత్తులను కూడా అందుబాటులో ఉంచటానికి సేంద్రియ వ్యవసాయ రైతులను కూడా ఆహ్వానిస్తున్నామని అలానే ప్రభుత్వ సంక్షేమ పథకాలు గురించి కూడా పూర్తి సమాజాన్ని రైతులకు వివరించే విధంగా ప్రభుత్వ రంగ సంస్థలను భాగస్వామ్యం చేస్తూ అధునాతన శాస్త్ర ఫలితాలను నవీన వ్యవసాయ పద్ధతుల గురించి కూడా రైతులకు తెలియజేయడానికి వివిధ వ్యవసాయ విశ్వవిద్యాలయాల నుంచి కూడా ప్రతినిధులను ఆహ్వానిస్తున్నట్టు తెలియజేశారు. త్వరలోనే ఈ జాతీయ రైతు దినోత్సవం 2025 గురించి పూర్తి వివరాలను తెలియజేస్తామని చెప్పినారు. ఈ ప్రతినిధుల బృందంలో పాల్గొన్నవారు Dr. A V Rao, Sri రంగారావు, శ్రీధర్ రెడ్డి, గారా రాఘవ రావు,   వినోద్, సురేందర్ రెడ్డి.