తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఓబీసీ సెల్ కన్వీనర్ గా సునీత సంపత్

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఓబీసీ సెల్ కన్వీనర్ గా  సునీత సంపత్

వికారాబాద్, ముద్ర ప్రతినిధి:వికారాబాద్ జిల్లా తాండూర్ మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ బీవీజీ ఫౌండేషన్ చైర్మన్ సునీత సంపత్ నియమిస్తూ ఎఐసిసి ఉత్తర్వులు జారీ చేసింది.

దీంతో పలువురు కాంగ్రెస్ నాయకులు ఆమె కు శుభాకాంక్షలు తెలిపారు.అలాగే ఈ యొక్క పదవి బాధ్యతలను అప్పగించిన మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ బీవీజీ ఫౌండేషన్ చైర్మన్ సునీత సంపత్అఖిలభారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేకు, రాహుల్ గాంధీకి, ప్రియాంక గాంధీ కి, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనముల రేవంత్ రెడ్డి కి, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ దీపా దాస్ మున్షి కి, తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కి, తెలంగాణ రాష్ట్ర ఓబీసీ సెల్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్ కి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి కి, ,తాండూర్ శాసనసభ్యులు బుయ్యని మనోహర్ రెడ్డికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.