టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులుగా విరాహత్ అలీ

టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులుగా విరాహత్ అలీ

శుభాకాంక్షలు తెలిపిన టియుడబ్ల్యూజే వనపర్తి జిల్లా నాయకులు

ముద్ర ప్రతినిధి, వనపర్తి : తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే) రాష్ట్ర  అధ్యక్షులుగా సీనియర్ పాత్రికేయులు కే.విరాహత్ అలీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రెండు పర్యాయాలుగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న విరాహత్ అలీ, రాష్ట్రంలోని అన్ని జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు, యూనియన్ సభ్యుల మద్దతుతో శుక్రవారం నాడు రాష్ట్ర ఎన్నికల రిటర్నింగ్ అధికారి రవీంద్ర శేషు, సహాయ ఎన్నికల అధికారి మల్లయ్యలకు నామినేషన్ సమర్పించారు.

అయితే నామినేషన్లకు డిసెంబర్ 29 చివరి రోజు కావడం, ఒకే ఒక నామినేషన్ అందడంతో విరాహత్ అలీ ఎన్నిక ఏకగ్రీవమైంది. నామినేషన్  కార్యక్రమంలో ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ) జాతీయ అధ్యక్షులు కే. శ్రీనివాస్ రెడ్డి, ఐజేయూ స్టీరింగ్ కమిటీ సభ్యులు, ఆం.ప్ర.ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్, ఐజేయూ జాతీయ కార్యదర్శి వై.నరేందర్ రెడ్డి, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ సభ్యులు ఎం.ఏ.మాజీద్, జాతీయ, రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. 

రాష్ట్ర అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన విరహత్ అలీకి టియుడబ్ల్యూజే (ఐజేయు) వనపర్తి జిల్లా అధ్యక్షుడు మధు గౌడ్ నేతృత్వంలో శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం TUWJ ( IJU) జాతీయ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, జాతీయ సలహాదారు దేవులపల్లి అమర్ లను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో  జిల్లా ప్రధాన కార్యదర్శి డి.మాధవరావు, జాతీయ కౌన్సిల్ సభ్యులు కె. ప్రశాంత్, ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షులు కొండన్న యాదవ్, జిల్లా స్టాఫ్ రిపోర్టర్ లు పౌర్ణరెడ్డి, మన తెలంగాణ స్టాఫ్ రిపోర్టర్ బి.రాజు, వార్త స్టాఫ్ రిపోర్టర్ రాము, రాజేందర్, V6 తేజ వర్ధన్,NTV అంజి లు పాల్గొన్నారు.