దేశంలో 24 గంటలు కరెంటు ఇస్తున్నది ఒక్క తెలంగాణ రాష్ట్రమే

దేశంలో 24 గంటలు కరెంటు ఇస్తున్నది ఒక్క తెలంగాణ రాష్ట్రమే
  • మునుగోడులో ఫ్లోరైడ్ తరిమికొట్టి సస్య శ్యామలం చేసిన ఘనత బీఆర్ఎస్ దే-సీఎం కేసీఆర్
  • మునుగోడు గడ్డపై కేసీఆర్ అడుగు పెట్టడం ఈ ప్రాంత ప్రజల అదృష్టం
  • బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, నల్గొండ:దేశంలో ఎక్కడా అనే విధంగా రైతులకు 24 గంటల ఉచిత కరెంటు ఇస్తున్నది ఒక్క తెలంగాణ రాష్ట్రమేనని సీఎం కేసీఆర్ అన్నారు. గురువారం నల్గొండ జిల్లా మునుగోడులో స్థానిక ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభకు ఆయన ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు గతంలో జరిగిన ఉపఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేస్ర్చుకున్నాం. గత పాలకులు ఈ ప్రాంతంలో ఉన్న ప్లోరైడ్ ను అంతం చెయ్యలేదు నూతన రాష్ట్రంలో ప్లోరైడ్ ను తరిమికొట్టి సస్యశ్యామలం చేసుకున్నాం. ఉద్యమంలో ఉన్నవాళ్లను ప్రజలు గెలిపించాలని సీఎం కోరారు. దేశంలో ఎక్కడా లేని విదంగా రైతులకు 24 గంటల ఇచ్చే రాష్ట్ర ఒక్క తెలంగాణ రాష్ట్రం అన్నారు. ఆసరా పెన్షన్లను పెంచుకున్నాం. ఉద్యమం వేపు ప్రజలు ఉండాలి. రాజకీయాల వైపు కాదన్నారు. మునుగొడు ప్రాంతం రాజకీయ చైతన్యం ప్రాంతం దొంగల ఎవరో పాలకులవరో గమనించాలన్నారు. మూడోసారి అధికారంలోకి రాగానే మానిపేస్టోను అమలు చేసుంటాంమన్నారు. పైసల కొరకు పార్టీలు మారే డబ్బు అహం కారులకు బుద్ది చెప్పాలి 2 లక్షల ఎకరాలకు సాకు నీరు తెచ్చే బాధ్యత నాది... కాంగ్రెస్ ను నమ్మి ప్రజలు మోసపోవద్దన్నారు.

ఉప ఎన్నికల్లో చూపించిన చైతన్య మరో చూపించి కారు గుర్తిను గెలిపించాలని కోరారు. మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ ఉద్యమ సారధి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి దాత రాష్ట్ర ని ఒక తండ్రిలా పాలిస్తుంన్నారు. డబ్బులతో రాజకీయం చేసే వాళ్లను మునుగోడు ప్రజలు నమ్మొద్దని కోరారు. ఉద్యమ సమయంలో మునుగోడు ప్రాంతాన్ని సీఎం కేసీఆర్  కలియతిరిగారని, మునుగోడు గోడును చూసి సాధించుకున్న రాష్ట్రంలో శస్య శ్యామలం చేసుకున్నామన్నారు. ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ మునుగోడు గడ్డపైన సీఎం కేసీఆర్ కాలు పెట్టడం ఈ ప్రాంత ప్రజల అదృష్టం 2003 నుండి అందరికి సూపరిచితున్ని, ఉద్యమ కాలంలో కేసీఆర్ కలియు తిరిగి ఈప్రాంతంలో ఉన్న బాధలు చూసి కన్నీరుపెట్టుకుండు. ఈ సమస్యల నుండి బయట పడాలంటే మునుగోడు కు మంచి నీళ్ళు ఇవ్వాలని సీఎం కాగానే చౌటుప్పల్ లో పైలాన్ ప్రారంభించారు.

గతంలో ఈ ప్రాంత వారికి పిల్లనివ్వాలంటే భయపడే వాళ్ళు, చర్లగూడెం ప్రాజెక్టు కడుతుంటే అనేక కేసులు పెట్టారు. అన్నింటిని తిప్పికొట్టి ప్రాజెక్టు పనులు సాగేలా చేశారు. నిత్యం ప్రజల్లో ఉండే వాడిగా నన్ను నమ్మి ప్రజలు ఓట్లేసి గెలిపించిండ్రు కానీ 2018 కల్లబొల్లి మాటలు చెప్పి ఒక్క కొబ్బరికాయ తో 100 పనులు అవుతాయని అబద్ధపు మాటలు చెప్పి గెలిచి ప్రజలను మోసం చేసిండు రాజగోపాల్ రెడ్డి జరిగిన ఉప ఎన్నికల్లో ప్రజలు అన్ని గ్రహించి నన్ను గెలిపించిండ్రు. ఉప ఎన్నికల్లో చెప్పిన హామీలు అమలు చేసుకున్నాం. చండూర్ రెవిన్యూ డివిజన్ చేసుకున్నాం. సుమారుగా 570 కోట్ల నిధులు ఇంచి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. కారును గెలిపిస్తే కారు నిండా నిధులు ఇస్తామని చెప్పి ఇచ్చిండు, తక్కువ సమయంలో అన్నీ పనులను ప్రారంభించుకున్నాం. 18 వేల కోట్ల రూపాయలకు కాంట్రాక్టు ల కొరకు బిజెపి అమ్ముడుపోయిండు రాజ్ గోపాల్ రెడ్డి ఇప్పుడు మరో కాంట్రాక్టు ల కొరకు కాంగ్రెస్ లోకి పోతుండు. ప్రజా సంక్షేమానికి కాదు ఆయన కాంట్రాక్టల కొరకు పనిచేస్తాడు.

తక్కువ సమయంలో అన్ని పనులు పూర్తి స్థాయిలో చేసుకోలేదు కాబట్టి మరో సారి అవకాశం ఇవ్వండి. ఈ ప్రాంత అభివృద్ధి కొరకు నా రక్తం దార పోస్తా సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్ హరీష్ రావు జగదీష్ రెడ్డిల దీవెనలతో అభివృద్ధి చేస్తానని ప్రమాణం చేశారు. ఈ సరైన సమయంలో ఉప ఎన్నికల్లో తీసుకున్న నిర్ణయం ఇప్పుడు కూడా తీసులోవాలని ప్రజలను కోరారు. మునుగొడు అభివృద్ధి కి నేను అడిగిన నిధులు కేసీఆర్ ఇచ్చిండు. మరోసారి అవకాశం ఇస్తే తుమ్మల పల్లి రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతో అభివృద్ధి చేసుకుందాం. ఉద్యమ కాలంలో ఉన్నప్పుడు ఈ ప్రాంత సమస్యలు కళ్లారా చేసిండు. మునుగొడు లో మనను మోసం చేయటానికి మాల్లోడు వస్తోండు మన నినాదాలు వానికి వినిపించాలి. నా తుది శ్వాస ఉన్నత వరకు ఈ ప్రాంత అభివృద్ధి కి పనిచేస్తా మరో సారి అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్లు, జడ్పీటీసీలు ఎంపీపీలు, సర్పంచులు ఎంపీటీసీలు బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.