పూణే లో తెలంగాణ వాసులు అరెస్టు.

పూణే లో తెలంగాణ వాసులు అరెస్టు.
  • 5 గురి దగ్గర భారీ గా డ్రగ్స్ పట్టివేత. 
  • 51 కోట్ల విలువ చేసే 101 కేజీల Methaqualone సీజ్ చేసిన DRI అధికారులు. 
  • హైదరాబాద్-పుణే జాతీయ రహదారి పై మాటు వేసి పట్టుకున్న DRI బృందం. 
  • మారుతీ షిఫ్ట్ కారు లో ఐదు డబ్బాలలో డ్రగ్స్ గుర్తింపు. 
  • తెలంగాణ, మహారాష్ట్ర, ఢిల్లీ, హర్యానా కు చెందిన 5 గురు అరెస్ట్. 


ముద్ర,తెలంగాణ:-తెలంగాణ లో ఎక్కడ నుంచి డ్రగ్స్ తీసుకొని వస్తున్నారని దానిపై విచారణ..

ఎంత కాలం నుండి ఈ దందా కొనసాగుతుంది అనే సమాచారాన్ని తెలుసుకునే పని లో పడ్డ DRI. 

తెలంగాణ రిజిస్ట్రేషన్ కలిగిన కారులో డ్రగ్స్ ను పుణే లోని ఏ ప్రాంతంకు తరలిస్తున్నారు? ఎవరికి ఈ డ్రగ్స్ ఇస్తున్నారు అనే వివరాలు స్వేకరించే పని లో పడ్డ DRI.  

పట్టుబడ్డ నిందితులు డ్రగ్స్ ను వివిధ రాష్ట్రాలలో విక్రయిస్తున్నట్లు సమాచారం.

ఈ ముఠా వెనుక ప్రధాన సూత్రధారులు ఎవరు ఉన్నారని ఆరా తీస్తున్న DRI. 

తెలంగాణ లో డ్రగ్స్ తయారీ కేంద్రం పై దాడులు చేసే అవకాశం. 

నోరు విప్పని నిందితులు. తమదైన స్టైల్ లో కూపీ లాగుతున్న అధికారుల బృందం.