ముద్ర ఎఫెక్ట్  వలన  కోనేరు ను శుభ్రం చేసిన ఆలయ అధికారులు 

ముద్ర ఎఫెక్ట్  వలన  కోనేరు ను శుభ్రం చేసిన ఆలయ అధికారులు 

బాసర, ముద్ర:-బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ కోనేరు గురించి నిన్న ముద్ర పత్రికలో వచ్చిన పచ్చదనం కాదు.. పవిత్ర పుణ్యక్షేత్రమైన బాసర కోనేరు అనే కథనానికి  ఆలయ అధికారులు స్పందించారు. కోనేరులో ఉన్న పిచ్చి మొక్కలను తొలగించి శుభ్రం చేశారు. మురికి నీటిని బయటకు వదిలేశారు. కోనేరు వద్ద ఘాట్లను కడిగేసి శుభ్రం చేశారు..