వైద్య ఖర్చులకు పది వేలు

వైద్య ఖర్చులకు పది వేలు

రామకృష్ణాపూర్,ముద్ర: పుట్టిన పసి పాపకు ట్యూబ్ బ్లాక్ అయ్యి ఆక్సిజన్ సమస్యతో హైదరాబాదులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారికి ఆత్మీయ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వైద్య ఖర్చుల నిమిత్తం పది వెల రూపాయలను పాప తల్లిదండ్రులు అరుకల శివ - ప్రవళిక దంపతులకు ఆదివారం హైదరాబాద్ కి వెళ్లి అందించారు. చిన్నారి చికిత్స నిమిత్తం ఇప్పటివరకు 18 లక్షల వరకు ఖర్చయిందని ఆపరేషన్ కొరకు మరో 8 లక్షలు ఖర్చవుతుందని పాప తల్లిదండ్రులు తెలిపారు. ఎవరైనా దాతలు ముందుకు వచ్చి పాప చికిత్స కొరకు సహాయం అందించాలని మానవతవాదులను వేడుకుంటున్నారు. ఫోన్ పే నంబర్ 9618969228 లేదా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అరకల శివ కుమార్ 62433325573 ఐ.ఎఫ్.ఎస్.సి కోడ్ ఎస్.బి.ఐ.ఎన్ 0020895 రామకృష్ణాపూర్ బ్రాంచ్ కి దాతలు సహాయం అందించాలని కోరుతున్నారు.