ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో ఉద్రిక్తత

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో ఉద్రిక్తత

ముద్ర ప్రతినిధి, ఖమ్మం:  జిల్లా కేంద్రంలోని ఖమ్మం వ్యవసాయ మార్కెట్ లో శనివారం కమిషన్ దారులు, రైతులు మధ్య వివాదం నెలకొంది. ఈ వారంలో మార్కెట్ కు అధికంగా మిర్చి బస్తాలు వచ్చాయి.  శుక్రవారం ఒక క్వింట మిర్చి ధర రూ.20,800 ఉండగా శనివారం 20,200 ధర గా నిర్ణయించారు. నాలుగైదు రోజులుగా క్రమంగా రేటు పెరుగుతుండగా  శనివారం ధర తగ్గించడంతో స్వల్ప వివాదం నెలకొంది. ఇదిలా ఉండగా ఓ వ్యాపారి వద్ద పెట్టుబడి తీసుకొని పంట పండించిన రైతు మరో వ్యాపారి వద్ద సరుకు విక్రయిస్తుండగా వివాదం జరిగింది. ఈ గొడవ చినికి, చినికి వ్యాపారులు రైతులు రెండు వర్గాలుగా ఏర్పడి వివాదం పెద్దదయింది. దీంతో ఓ కమిషన్ వ్యాపారిపై రైతుల దాడి చేశారు . మార్కెట్ లో వ్యాపారులు కొనుగోలు నిలిపివేశారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన మార్కెట్ కి చేరుకున్నారు. మార్కెట్ అధికారులు పాలకవర్గం వివాదాన్ని సర్దుమనిగించేందుకు చర్యలు చేపట్టింది.