నాకు మార్కులు వేయకపోతే - మా తాతతో చేతబడి చేయిస్తా'

నాకు మార్కులు వేయకపోతే - మా తాతతో చేతబడి చేయిస్తా'

ముద్ర,ఆంధ్రప్రదేశ్:- ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ప‌దోత‌ర‌గ‌తి ప‌రీక్ష పేప‌ర్ల మూల్యాంకనం స‌మ‌యంలో అరుదైన ఘ‌ట‌న వెలుగు చూసింది. ఓ విద్యార్థి తెలుగు ప‌రీక్ష జ‌వాబు ప‌త్రంలో నాకు మార్కులు వేయకపోతే.. మా తాత చేత చేతబడి చేయిస్తా.. అంటూ బెదిరిస్తూ రాసిన వాక్యం ఇప్ప‌డు ఏపీలో హాట్‌టాఫిక్‌గా మారింది.

ఏపీలోని బాపట్ల పురపాలక ఉన్నత పాఠశాలలో పదోతరగతి పరీక్ష పత్రాల మూల్యాంకనం చేప‌ట్టారు. ఈ సంద‌ర్భంగా తెలుగు సబ్జెక్టులో రామాయణం ప్రాశస్త్యం గురించి వివరించండి అనే ప్రశ్నకు ఒక విద్యార్థి 'నాకు మార్కులు వేయకపోతే మా తాత చేత చేతబడి చేయిస్తా' అని రాయడంతో మూల్యాంకనం చేస్తోన్న టీచ‌ర్ ఒక్క‌సారిగా హ‌డ‌లిపోయారు. వెంట‌నే తేరుకుని స‌ద‌రు విష‌యాన్ని అక్క‌డి అధికారుల‌కు తెలియ‌జేశారు.