బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు అరవపల్లి మండల కేంద్రంలో ఘన స్వాగతం పలికిన బిఆర్ఎస్ శ్రేణులు
- వేలాదిగా తరలివచ్చిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు
- పూలమాలలు శాలువాలతో కేటీఆర్ ను సన్మానించిన నాయకులు కార్యకర్తలు
- తనకు స్వాగతం పలకడానికి వేలాదిగా తరలి వచ్చిన బి ఆర్ ఎస్ నాయకులకు కార్యకర్తలకు అభివాదం చేసిన కేటీఆర్
- కేటీఆర్ కు స్వాగతం పలికిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్
- అనంతరం మహబూబాద్కు బయలుదేరిన కేటీఆర్
తుంగతుర్తి ముద్ర :- బిఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ కు తుంగతుర్తి నియోజకవర్గం అర్వపల్లి మండల కేంద్రంలో బి ఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున స్వాగతం పలికారు .హైదరాబాదు నుండి బయలుదేరిన కేటీఆర్ అరవ పెళ్లి మీదుగా మహబూబాబాద్ లో జరిగే మహా ధర్నాకు తరలి వెళ్తుండగా మార్గమధ్యంలో అరవ పెళ్లిలో బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కేటీఆర్ ను పూల మాలలతో శాలువాలతో ఘనంగా సన్మానించారు.
వేలాదిమంది గా వచ్చిన పార్టీ నాయకులు కార్యకర్తలు చూసి కేటీఆర్ సంతృప్తి వ్యక్తం. చేశారు ఈ సందర్భంగా కేటీఆర్ వాహనం పైకెక్కి స్వాగతం పలకడానికి వచ్చిన ప్రజలకు అభివాదం చేశారు. అభివాదం చేస్తున్న సందర్భంలో వేలాదిమంది కేటీఆర్ సీఎం సీఎం అంటూ నినాదాలు చేశారు. బి ఆర్ఎస్ కార్యకర్తల నినాదాలతో అరవపల్లి మండల కేంద్రం దద్దరిల్లింది. గులాబీ జెండాలతో స్వాగత తోరణాలతో బిఆర్ఎస్ నాయకుల ఫ్లెక్సీలతో అరవపల్లి మండల కేంద్రం గులాబీ మయంగా మారింది.
ఈ సందర్భంగా కేటీఆర్ వెంట రాష్ట్ర నాయకులతో పాటు రాష్ట్ర మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ,మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ గుజ్జ దీపిక యుగంధర్ రావు, లతోపాటు తుంగతుర్తి నియోజకవర్గ అన్ని మండలాల బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.