కౌంటింగ్ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్

కౌంటింగ్ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్

ముద్ర ప్రతినిధి, నిర్మల్: జూన్ 4 న పార్లమెంటు ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం కానున్న నేపథ్యంలో నిర్మల్ ఓట్లు లెక్కించే ఆదిలాబాద్ సంజయ్ గాంధీ పాలిటెక్నిక్ కళాశాలను నిర్మల్ కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, ఎస్పి జానకీ షర్మిల లు శుక్రవారం సందర్శించారు. ఇందులో భాగంగా కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూం ను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్ట్రాంగ్ రూం వద్ద మూడంచెల భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు. కౌంటింగ్ కేంద్రంలోకి కేవలం ఎంట్రీ పాసులు ఉన్నవారిని మాత్రమే అనుమతించనున్నట్లు వారు స్పష్టం చేశారు.