జర్నలిస్టులు అధిక సంఖ్యలో తరలి రావాలి

జర్నలిస్టులు అధిక సంఖ్యలో తరలి రావాలి
  • నేడు తుంగతుర్తిలో జరిగే టియుడబ్ల్యూజే-ఐ జే యు జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయాలి
  • టి యు డబ్ల్యూ జే  ఐ జే యు రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చలసాని శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి డాక్టర్ బంటు కృష్ణ, గ్రామీణ విలేకరుల సంఘం రాష్ట్ర నాయకులు దొంతి రెడ్డి కర్ణాకర్ రెడ్డి, స్టేట్ కౌన్సిల్ మెంబర్ మిక్కిలినేని శ్రీనివాసరావు, జిల్లా కోశాధికారి గుంటూరు రాము, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్ష, కార్యదర్శి మల్లికార్జున్, విజయ్, కోశాధికారులు రామకృష్ణ, చందన్, నాగరాజు, రషీద్ పిలుపు

ముద్ర ప్రతినిధి సూర్యాపేట:- తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో 20వ తేదీ మంగళవారం( నేడు) నిర్వహించే సూర్యాపేట టీయూడబ్ల్యూజే ఐజేయు జర్నలిస్టుల జిల్లా సర్వసభ్య సమావేశానికి జర్నలిస్టులు అధిక సంఖ్యలో తరలివచ్చి సమావేశాన్ని విజయవంతం చేయాలని   టీయూడబ్ల్యూజే-ఐజేయు . రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చలసాని శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి డాక్టర్ బంటు కృష్ణ, గ్రామీణ విలేకరుల సంఘం రాష్ట్ర నాయకులు దొంతి రెడ్డి కర్ణాకర్ రెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు మిక్కిలినేని శ్రీనివాసరావు, ఎలక్ట్రాన్ మీడియా అధ్యక్ష కార్యదర్శులు బత్తుల మల్లికార్జున్ రెబ్బ విజయకుమార్   యూనియన్ జిల్లా కోశాధికారి గుంటూరు రాము, కోశాధికారులు గుడిపూడి రామకృష్ణ, తల్లాడ చందన్ లు పిలుపునిచ్చారు.

సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో యూనియన్ నాయకులు సభ్యులతో నిర్వహించిన సమావేశంలో వారు  మాట్లాడుతూ  ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రివర్యులు ఉత్తంకుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లు హాజరవుతున్నారని,  అలాగే టి యు డబ్ల్యూ జే-ఐజేయు రాష్ట్ర అధ్యక్షులు గా ఎన్నిక కాబడిన విరాహత్ అలీ ఇండియన్ జర్నలిస్టు యూనియన్ జాతీయ కార్యవర్గ సభ్యులు కొనిజేటి సత్యనారాయణ తో పాటు స్థానిక శాసనసభ్యులు మందుల సామేలు, మాజీ మంత్రి రామిరెడ్డి దామోదర్ రెడ్డితోపాటు పలువురు ప్రముఖులు హాజరవుతున్నారని తెలిపారు. సమావేశంలో ప్రస్తుతం జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను చర్చించి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. కావున జిల్లా వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులు అత్యధిక సంఖ్యలో హాజరై సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో టి యు డబ్ల్యూ జే నాయకులు పులుసు నాగరాజు, షేక్ రషీద్, పల్లె మణి బాబు కోండ్లే కృష్ణయ్య జహీర్, రామచంద్రరాజు, కొండ శ్రీనివాసరావు, వాసా చంద్రశేఖర్, సుమన్, గూడూరు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.