తెలంగాణ శాసనసభ ఎన్నికలు నవంబర్ చివరి నాటికి జరగడం ఖాయం

తెలంగాణ శాసనసభ ఎన్నికలు నవంబర్ చివరి నాటికి జరగడం ఖాయం
  • ల్యాండ్,మైన్స్ ,వైన్సే కాదు మట్టి టాక్స్ వసూలు చేస్తున్న బి.ఆర్.ఎస్ ఎమ్మెల్యే....
  • కాంగ్రెస్ పార్టీ హయాంలోనే కోదాడ అభివృద్ధి...   మాకు పిల్లలు లేరు
  • కోదాడ నియోజకవర్గ నియోజకవర్గ ప్రజలే మా పిల్లలు
  • కోదాడ నియోజక వర్గం లో50 వేల మెజార్టీ కంటే ఒక ఓటు తగ్గినా రాజకీయాల నుండి తప్పకుంటా...
  • యాదృచ్ఛికంగా ఎయిర్ పోర్టులో కలిసిన విషయాన్ని పార్టీ మారుతున్నారని మాపై దుష్ప్రచారం చేస్తున్నారు
  • అధికారుల, పోలీసుల తీర్పుపై మండి పడ్డ ఉత్తమ్
  • వడ్డీ తో సహాతీర్చుకోవాల్సిన టైం వస్తుందని హెచ్చరిక
  • కాంగ్రెస్ పార్టీ శాసన సభ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఎంపీ ఉత్తమ్

కోదాడ, ముద్ర:తెలంగాణ శాసనసభ ఎన్నికలు నవంబర్ చివరి నాటికి జరగడం ఖాయం అని నాయకులు ,కార్యకర్తలు ఎన్నికలకు సిద్ధం కావాలని తెలంగాణ టీపీసీసీ మాజీ చీఫ్ నల్గొండ పార్లమెంటు సభ్యులు ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం కోదాడ పట్టణంలోని గునుగుంట్ల అప్పయ్య హాల్ లో కోదాడ నియోజకవర్గ కాంగ్రేస్ పార్టీ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.సెప్టెంబర్ నెల లో ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని కోదాడ నియోజక వర్గం లో తాను 50 వేల మెజార్టీతో విజయం సాధిస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు.50 వేల మెజార్టీ కి ఒక్క ఓటు తగ్గినా తాను రాజకీయాల నుండి తప్పుకుంటానన్నారు.కాంగ్రెస్ పార్టీ హయాంలోనే కోదాడ అభివృద్ధి జరిగిందన్నారు.కోదాడలో ఇప్పుడు మొత్తం స్యాండ్,ల్యాండ్ మైన్స్ ,వైన్స్ అంతే కాకుండా బీఆర్. ఎస్ ఎమ్మెల్యే కొత్తగా మట్టి ట్యాక్స్ వసూలు చేస్తున్నారని విమర్శించారు.మాకు పిల్లలు లేరు,కోదాడ నియోజకవర్గ ప్రజలే తమ పిల్లలు అన్నారు.1994లో నేను మొదటి సారి కోదాడ నుండి పోటి చేసి ఓడి పోయినా అప్పటి నుంచి ఏ హోదాలో ఉన్న కోదాడ ప్రాంతాన్ని కంటికి రెప్పలా చూసుకుంటున్నాఅన్నారు.

కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాల్లో అధికారుల, తీరుపై ఆయన మండిపడ్డారు.అధికారులను ఈ వేదిక నుండి హెచ్చరిస్తున్నాం వడ్డీతో సహా తీర్చుకోవాల్సిన టైం వస్తుందని హెచ్చరించారు. ఇటీవల తాను,పద్మావతి పార్టీ మారుతున్నామని పని కట్టుకొని ప్రచారాలు చేస్తున్నారని ఖండించారు.యాదృచ్ఛికంగా ఎయిర్ పోర్టులో కలిసిన విషయాన్ని , సోషల్ మీడియాలో ప్రచారం చేసారన్నారు.కార్యకర్తలు ఐక్యం గా పని చేస్తూ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు.సొషల్ మీడియా ద్వారా ప్రజలను ప్రభావితం చేయాలన్నారు.అనంతరం మాజీ ఎమ్మెల్యే పద్మావతి కార్యకర్తలను ఉత్తేజ పరుస్తూ మాట్లాడారు. సమావేశానికి ముందు సర్వ మాతా ప్రార్థనలు ,పూజలు నిర్వాగించారు. ఈ  సమావేశంలో టి పి సి సి రాష్ట్ర కార్యదర్శి సిహెచ్ లక్ష్మీనారాయణ రెడ్డి ,డీసీసీ అధ్యక్షుడు చెవిటి వెంకన్న, ఆకుల లలిత, కోదాడ పట్టణ అధ్యక్షులు వంగవీటి రామారావు ,మాజీ సర్పంచ్ పారా సీతయ్య ,మున్సిపల్ కాంగ్రెస్ ఫోర్ లీడర్ ,కందుల కోటేశ్వరరావు, కౌన్సిలర్లు గంధం యాదగిరి, షాబుద్దీన్ మండల పార్టీ అధ్యక్షులు వరప్రసాద్ రెడ్డి, ఆవుదొడ్డి ధన మూర్తి, సోషల్ మీడియా కన్వీనర్ రజనీకాంత్,బాజాన్, వివిధ మండలాల మండల పార్టీ అధ్యక్షులు సర్పంచులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.