ఉద్యమకారులను గుర్తించి ఇంటి స్థలాలను ఇవ్వాలి గ్రామ సమస్యలను పరిష్కరించాలి

ఉద్యమకారులను గుర్తించి ఇంటి స్థలాలను ఇవ్వాలి గ్రామ సమస్యలను పరిష్కరించాలి

ముద్ర న్యూస్ గరిడేపల్లి: గరిడేపల్లి మండల పరిధిలో ఉన్న గారకుంట తండ గ్రామంలో ఈరోజు జరుగుతున్నతెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ప్రజాపాలన కార్యక్రమంలో ఈరోజు గారకుంట తండ గ్రామపంచాయతీలో జరిగిన ప్రజా పాలనలో తెలంగాణ తొలి మలిదశ ఉద్యమకారులు గుగులోతు నరేందర్ నాయక్ సందీప్ నాయక్ కలిసి అధికారులకు వినతిపత్రం ఇవ్వడం జరిగింది.

ఉద్యమ సమయంలో ప్రత్యేక ఉద్యమంలో ఎవరైతే పాల్గొన్నారో ఉద్యమకారులను గుర్తించి ఇంటి స్థలాలు ఇవ్వాలని ఉద్యమం చేస్తున్నప్పుడు సుమారు 50. నుంచి 60మంది పాల్గొంటే పోలీసులు పది నుంచి 20 మంది మీదనే కేసులు చేశారని మిగతా వారి మీద కేసులు చేయలేదని అలాంటి సమయంలో నికార్సైన ఉద్యమకారులు లబ్ధి పొందట్లేదని వారు అన్నారు తెలంగాణ మలిదశ ఉద్యమంలో ఏ గ్రామం నుంచి ఎవరైతే పాల్గొన్నారో వారికి ప్రత్యేకంగా సర్వే చేయించి లబ్ధిదారులను గుర్తించాలని లేకుంటే అమాయకమైన లబ్ధిదారులు ఆరోజు చదువు మానేసి రోడ్లపై ఉద్యమాలు చేస్తే ఈరోజు కనీసం వారి కుటుంబ పరిస్థితులు కూడా బాగోలేదని వారిని గుర్తించి మాత్రమే వారికి న్యాయం చేయాలని వారు అధికారులకు ప్రత్యేకంగా వినతిపత్రం సమర్పించారు అదేవిధంగా గారకుంట తండా గ్రామపంచాయతీలో అతి ముఖ్యమైన ఆరు పనులను గుర్తించి అధికారులకు వినతి పత్రం సమర్పించారు యాతవాకిల నుండి కలమలచెరువు గారకుంట తండా మీదగా మిర్యాలగూడకు బస్సు సర్వీసును ఏర్పాటు చేయాలని చివరి వరకు విద్యుత్ లైన్లు ఏర్పాటు చేయాలని గత రాష్ట్ర ప్రభుత్వం వేసిన లచ్చికుంట బ్రిడ్జి మాదిరిగానే శియ్య గండి బ్రిడ్జిని 10 లక్షల రూపాయలతో వేయాలని మిషన్ భగీరథ ట్యాంక్ నుంచి ప్రతి ఇంటింటికి నల్ల కలెక్షన్ ఇవ్వాలని మెయిన్ ట్రాన్సఫారం దగ్గర ఆన్ ఆఫ్ స్విచ్ఏర్పాటు చేయాలని కోరడం జరిగింది ఈకార్యక్రమంలో తెలంగాణ మలిదశ ఉద్యమకారులు గుగులోతు వెంకట్రాం నాయక్ సోమలా నాయక్ సుక్కో నాయక్ లకుపతి నాయక్ లాలు నాయక్ తదితరులు పాల్గొన్నారు