స్వగ్రామానికి చేరిన గల్ఫ్ కార్మికుడి మృతదేహం

స్వగ్రామానికి చేరిన గల్ఫ్ కార్మికుడి మృతదేహం
  • గ్రామంలో విషాద చాయలు 
  • శోకసంద్రంలో కుటుంబ సభ్యులు 

ముద్ర, బోయినిపల్లి:- రాజన్న సిరిసిల్ల జిల్లా  బోయినిపల్లి మండలం బూరుగుపల్లి గ్రామానికి చెందిన గల్ఫ్ కార్మికుడు గంగిపల్లి తిరుపతి గత పది రోజుల క్రితం దుబాయ్ లోని సోనార్ క్యాంపులో ప్రమాదవశాత్తు మరణించాడు.గల్ఫ్ కార్మికుడి మృతదేహం ఎట్టకేలకు పది రోజుల తర్వాత దుబాయ్ నుండి బూరుగుపల్లి గ్రామానికి చేరుకుంది.ఈ సందర్భంగా మృతదేహాన్ని చూసిన కుటుంబ సభ్యులు తీవ్ర శోకసంద్రంలో విలపించారు.బూరుగుపల్లి గ్రామంలో అందరితో కలిసిమెలిసి ఉండే గంగిపల్లి తిరుపతి చనిపోయాడని తెలిసి, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున వారి స్వగృహానికి తరలివచ్చారు. బోరున గ్రామస్తులు విలపించారు. గల్ఫ్ కార్మికుడు గంగిపల్లి తిరుపతికి ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు మృతుడి అంతిమయాత్రలో పెద్ద ఎత్తున వివిధ రాజకీయ పార్టీల నాయకులు గ్రామస్తులు ఆయన స్నేహితులు పాల్గొన్నారు..