చేనేతను విస్మరిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు

చేనేతను విస్మరిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు
  • మోడీ వచ్చాక సంక్షేమ బోర్డు, పథకాల రద్దు
  • బిజెపి మనుధర్మ శాస్త్రాన్ని ప్రచారం చేస్తుంది
  • సహకార వ్యవస్థను  వెంటనే పునరుద్ధరించాలి
  • చేనేత బంధు పథకాన్ని అమలు చేయాలి
  • ఈనెల 22న హైదరాబాద్ లో అఖిల భారత చేనేత సదస్సు
  • చేరుపల్లి సీతారాములు

ముద్ర, నల్గొండ:  కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం చేనేత రంగాన్ని పూర్తిగా విస్మరిస్తోంది. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చాక చేనేత సంక్షేమ బోర్డును  రద్దు చేయడమే కాకుండా సంక్షేమ పథకాల సంస్థలను రద్దు చేశారని తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు చెరుపల్లి సీతారాములు మండిపడ్డారు. మంగళవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని  పద్మశాలి భవనంలో ఏర్పాటుచేసిన  తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర రెండవ మహాసభలకు ఆయన ముఖ్య అతిథి హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో, దేశంలో చేనేత జీవన స్థితిగతులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి ఏంటనే విషయాలను కులకశoగా చర్చించి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు. బిజెపి చేనేత కోసం ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలను రద్దు చేస్తుందని విమర్శించారు. స్వాతంత్ర ఉద్యమంలోనే చేనేత కార్మికులు కీలకమైన పాత్ర పోషించారన్నారు. 

అనేక ఉద్యమాల ఫలితంగా కేంద్రంలో కొన్ని పథకాలను  తెచ్చుకున్నామని, బడ్జెట్ రాబట్టుకోవడం కూడా జరిగిందని తెలిపారు. మోడీ  అధికారంలోకి  వచ్చాక వాటన్నింటినీ పూర్తిగా నిర్వీర్యం చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు.ఏ కులంలో ఉన్న వారు  ఆ కులవృత్తి  చేసుకొని బ్రతకాలని మనువాదాన్ని, మను ధర్మ శాస్త్రాన్ని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఏ కులం వాళ్లు ఆ కులవృత్తిని చేసుకునే సమాజం ఇది కాదని, వృత్తులపై ఆధారపడ్డ పరిస్థితి నేడు ఉందన్నారు. చేనేత కార్మిక సంఘం అనేది మగ్గం పైనే ఆధారపడ్డ బ్రతుకుల విషయాలపై చర్చించేందుకు సంఘం ఏర్పడింది అన్నారు. గతంలో సహకార సంఘాలు ఉండేవని ప్రభుత్వం సహకార వ్యవస్థను పూర్తిగా రద్దు చేసిందని దీంతో ఎన్నికలు లేక సంఘానికి నిధులు వెచ్చించక బ్రష్టు పట్టించారని మండిపడ్డారు. వెంటనే సహకార వ్యవస్థను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఎన్నికలు జరపాలని, క్యాష్ క్రెడిట్ ఇవ్వాలని సహకార సంఘాల ద్వారా మగ్గల ద్వారా పని కల్పించి సరైన పద్ధతిలో కూలి పెంచి ఇవ్వాలని డిమాండ్ చేశారు. దళిత బంధువు లాగానే మగ్గం నేసే ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయలను ఇస్తూ చేనేత బందును అమలు చేయాలని డిమాండ్ చేశారు.

ALSO READ: స్కాన్​ ఐరన్​ పరిశ్రమలో బాయిలర్​ పేలుడు

 జియో ట్యాగ్ వేసిన మగ్గాలనే లెక్కిస్తున్నారని దీంతో ప్రభుత్వం చెప్పే సంఖ్యకు వాస్తవంగా మగ్గాలు నేసే సంఖ్యకు తేడా ఉందా అన్నారు. ప్రభుత్వం జియో ట్యాగ్ విషయంలో పునర్ ఆలోచన చేయాలని మగ్గం నేసే వారిని రిజిస్టర్ చేసి రిజిస్టర్ చేసిన వారి కుటుంబాలకు  చేనేత బందును అమలు చేయాలని డిమాండ్ చేశారు. మగ్గం ఉన్నవారికి 3000 ఇస్తానని చెప్పడం సంతోషించేదగ్గ విషయమే అన్నారు.  చేనేత కార్మికుల కుటుంబాలపై ప్రభుత్వానికి ఏమాత్రం ప్రేమ ఉన్న చేనేత బంధు పథకాన్ని అమలు చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం అయితే మరీ దారుణంగా చేనేతలపై జిఎస్టి వేసిందని దానిని వెంటనే ఉపసంహరించుకోవాలని సంక్షేమ బోర్డును, పథకాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.  చేనేత సమస్యల  పరిష్కారం కోసం రానున్న రోజుల్లో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈనెల 22న హైదరాబాద్ లో నిర్వహించే అఖిల భారత చేనేత సదస్సును జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. 

చేనేత కార్మిక సంఘం రాష్ట్ర రెండొవ మహాసభలకు అధ్యక్ష వర్గంగా గంజి మురళీధర్ , గుర్రం నరసింహ, కందగట్ల గణేష్ ను వ్యవహరించారు. మహాసభల ప్రారంభానికి ముందు రాష్ట్ర గౌరవ అధ్యక్షులు చెరుపల్లి సీతారాములు జెండా ఆవిష్కరణ చేశారు ఈ సమావేశంలో గౌరవ సలహాదారులు కూరపాటి రమేష్ బడుగు శంకరయ్య పాసికంటి లక్ష్మీనరసయ్య, గోషిక స్వామి, గుండు వెంకట నర్సు, వర్కల  చంద్రశేఖర్ ,కూరపాటి రాములు, చిలుకూరి లక్ష్మీనర్స్, కర్నాటి బిక్షం నామని ప్రభాకర్ , తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) జిల్లా ప్రధాన కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య, రైతు సంఘం జిల్లా నాయకులు కుంభం కృష్ణారెడ్డి, గంజి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.  ఈ మహాసభలో చేనేత పై విధించిన జీఎస్టీ ని రద్దు చేయాలని చేనేత పెట్టుబడి సాయం కోసం దళిత బంధుతరహా లో చేనేత బంధు ప్రకటించి పది లక్షలు ఇవ్వాలని చేనేత కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు కోసం విశాల ఐక్యవేదిక ఏర్పాటు చేసి పోరాటాలు నిర్వహించాలని మహాసభలో తీర్మానాలు ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది అనంతరం తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

గౌరవాధ్యక్షులు చెరుపల్లి సీతారాములు 
అధ్యక్షులు వనం శాంతి కుమార్
 ప్రధాన కార్యదర్శి గంజి మురళీధర్
 కోశాధికారి గుండు వెంకట నర్సు
గౌరవ సలహాదారులు కూరపాటి రమేష్ 
బడుగు శంకరయ్య 

ఉపాధ్యక్షులుగా గోశిక స్వామి, కూరపాటి రాములు, వనం ఉపేందర్,ముషం నరహరి  సహాయ కార్యదర్శిలుగా గుర్రం నరసింహ, చేన్న రాజేష్, జి భాస్కర్ మరో 13 మంది రాష్ట్ర కార్యవర్గ సభ్యులను  ఎన్నుకున్నారు.