కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి ఇచ్చిన హామీలను అమలు చేయాలి

కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి ఇచ్చిన హామీలను అమలు చేయాలి
  • రైతు సంఘం జిల్లా అధ్యక్షులు డి బాల్ రెడ్డి.

ముద్ర.వీపనగండ్ల:- కేంద్ర ప్రభుత్వం రైతన్ననికి రాతపూర్వకంగా ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని రైతు సంఘం వనపర్తి జిల్లా అధ్యక్షులు డి బాల్ రెడ్డి డిమాండ్ చేశారు.తెలంగాణ రైతు సంఘం  వీపనగండ్ల  గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఢిల్లీ రైతాంగ ఉద్యమానికి మద్దతుగా మండల కేంద్రంలో రోడ్డుపై నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా అధ్యక్షులుండి బాల్ రెడ్డి మాట్లాడుతూ గత సంవత్సరం రైతు ఉద్యమం జరిగిన సందర్భంగా రైతు ప్రతినిధులతో కేంద్ర బిజెపి ప్రభుత్వం చర్చలు జరిపి రైతన్ననికి రాతపూర్వకంగా హామీలు ఇవ్వడం జరిగిందని, నేటి వరకు అవి అమలు కాదవడం లేదని అన్నారు.

కాబట్టి రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని, కనీస మద్దతు ధరల చట్టం అమలు చేసి రుణమాఫీ చేయాలని. విద్యుత్ సవరణ బిల్లు ఉపసంహరించాలన్నారు.రైతులకు పదివేల పింఛన్ ఇవ్వాలని,ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు కరణ ఆపాలని, కనీస వేతనం కార్మికులకు 26 వేల రూపాయలు ఇవ్వాలని, 2013 భూ సేకరణ చట్టాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని  డిమాండ్ చేశారు. ఇది అమలు చేయకపోతే రేపు జరిగే ఎన్నికల్లో బిజెపి ప్రభుత్వాన్ని ఓడించాలని వారు పిలుపునిచ్చారు.కార్యక్రమంలో గ్రామ రైతు కమిటీ అధ్యక్షులు వెంకటయ్య, కోశాధికారి వెంకటస్వామి, రైతు నాయకులు ఈశ్వర్, సిహెచ్ వెంకటయ్య, బాల పేరు, వీరబాబు, గోపి, కృష్ణయ్య, వెంకటస్వామి, బత్తుల రాముడు, రామకృష్ణ, వెంకటేశ్వర్లు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.