అభివృద్ధిని ప్రతి పక్ష నాయకులు గుర్తించాలి

అభివృద్ధిని ప్రతి పక్ష నాయకులు గుర్తించాలి
Jagityal MLA Sanjay kumar

నాడు 20 వేల ఎకరాల్లో నేడు  59 వేల ఎకరాలలో పంటలు సాగు: జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమారు

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: నియోజక వర్గంలో  గత 40 ఎండ్ల లో 20 వేల ఎకరాల కంటే తక్కువగా పంట సాగు అయ్యేదని, .నేడు సిఎం కేసిఆర్ కారణంగా 59 వేల ఎకరాలలో పంట సాగు అవుతుందని అభివృద్ధిని ప్రతి పక్ష నాయకులు  గుర్తించాలని జగిత్యాల ఎమ్మెల్యే  డా. సంజయ్ కుమారు అన్నారు. రాయికాల్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ బిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక మిషన్ కాకతీయ, కాళేశ్వరం,24 గంటల కరెంట్, సకాలంలో ఎరువుల సరఫరా, గ్రామ గ్రామాన పంట కొనుగోలు కేంద్రాలు.. రాత్రిళ్ళు పొలం దగ్గరికి వెళ్ళే రైతుకు గోస తప్పింది అని గుర్తించాలని అన్నారు. ప్రజా ప్రతినిదులు ప్రభుత్వానికి, ప్రజలకు, రైతులకు మధ్య అనుసంధానంగా ఉండాలి..సమస్యలను పరిష్కరించాలి... అంతే గానీ ప్రజలను ఆగం చెయ్యద్దని అన్నారు.

ఇటీవల వర్షాలకు దెబ్బతిన్న రోళ్ళ వాగు, అరగుండాలకు నిధులు కేటాయింపు, మహితా పూర్ నుండి బోర్న్ పల్లి వరకు చెక్ డ్యాం ల నిర్మాణం తో  నేడు వేసవిలో సైతం జలకళ సంతరించుకున్నాయన్నారు. బీజేపీ,కాంగ్రెస్ రెండు తోడు దొంగలని, గత పార్ల మెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ బలంగా ఉన్న చోట్ల లో కూడా బీజేపీ కి మద్దతు ఇచ్చారు... పోలింగ్ బూత్ లెక్కల ప్రకారం  ప్రజలకు అన్ని తెలుసని, నియోజకవర్గంలో గతంలో కంటే పసుపు పంట సాగు తగ్గడం గత పాలకుల రైతు వ్యతిరేక నిర్ణయాలు అని అన్నారు.  బాండ్ పేపర్  రాసిచ్చిన ఎంపి అరవిందును ఎప్పుడైనా కాంగ్రెస్ జీవన్ రెడ్డి విమర్శించార అని ప్రశ్నించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కాంగ్రెస్ రెండు పరస్పర అంగీకారంతో ఓప్పంద్దం తో ఉన్నాయని, జీవన్ రెడ్డి మాటలు ప్రజలు నమ్మే స్థితిలో లేరని ప్రజలను తప్పు దోవపట్టించాలని చూస్తున్నారని ప్రజలు గమనించాలని అన్నారు.