కేంద్ర ప్రభుత్వo నియంతృత్వ చర్యలు వెంటనే ఉపసంహరించుకోవాలి. 

కేంద్ర ప్రభుత్వo నియంతృత్వ చర్యలు వెంటనే ఉపసంహరించుకోవాలి. 
  • ప్రజాస్వామ్యాన్ని రక్షించాలి. 
  • కాంగ్రెస్,వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిరసన.... 
  • కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం 

ముద్ర ప్రతినిధి సూర్యాపేట:-పార్లమెంట్ సభ్యులను అప్రజాస్వామికంగా సస్పెండ్ చేసి కేంద్ర బిజెపి ప్రభుత్వ నియంతృత్వ చర్యలకు పాల్పడిందనిసిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి, జిల్లాకాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి చకిలం రాజేశ్వరరావు ,సిపిఐ జిల్లా కార్యదర్శి బెజవాడ  వెంకటేశ్వర్లు, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి మండారి డేవిడ్ కుమార్,  సిపిఐ ఎంఎల్ ప్రజా పంద జిల్లా నాయకులుపేర్ల నాగయ్య, తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షులు గట్ల రమాశంకర్, దళిత మహాసభ రాష్ట్ర నాయకులు నారబోయిన వెంకట్ యాదవ్  లుఆరోపించారు. శుక్రవారం ఇండియా కూటమి ఇచ్చిన పిలుపులో భాగంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ దగ్గర కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ, న్యూ డెమోక్రసీ, ప్రజాపంద, తెలంగాణ జన సమితి, దళిత మహాసభ ఆధ్వర్యంలో నిరసన తెలియజేసి అనంతరం కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల పార్లమెంట్ లో చోటు చేసుకున్న పొగ బాంబు ఘటనపై సమగ్ర చర్చ జరగాలని డిమాండ్ చేశారు. ఈ దాడికి పాల్పడిన దుండగులను  కఠినంగా శిక్షించాలని కోరారు. పార్లమెంటుకే రక్షణ లేకపోతే సామాన్య ప్రజలకు రక్షణ ఎలా ఉంటుందని ప్రశ్నించారు. దీనిపై స్వస్థమైన సమాధానం చెప్పకుండా ప్రతిపక్ష పార్టీల నోరు నొక్కిందుకుబిజెపి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆరోపించారు.బిజెపి వైఖరి ఎండగడుతూ ప్రశ్నిస్తున్న 146 మంది పార్లమెంటు సభ్యులను సస్పెండ్ చెయ్యడాన్ని అఖిలపక్ష పార్టీలుతీవ్రంగా ఖండిస్తున్నాయన్నారు. దేశ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా పార్లమెంటులో బిజెపి నిరంకుశంగా వ్యవహరించడాన్ని  వ్యతిరేకిస్తూ నిరసనలు దేశవ్యాప్తంగా చేస్తున్నామని అన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మతోన్మాద, ప్రజా వ్యతిరేక పరిపాలన కొనసాగిస్తున్న బిజెపి ప్రభుత్వాన్ని గద్దె దించడం ఖాయమన్నారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ఎండి అంజద్ అలీ,కాంగ్రెస్ నాయకులుచింతమల్ల రమేష్, కక్కిరేణి శ్రీనివాస్, వీరన్న నాయక్, ఆలేటి మాణిక్యం, అబ్దుల్ రహీం, పోలబోయిన నరసయ్య యాదవ్, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నెమ్మది వెంకటేశ్వర్లు, కొలిశెట్టి యాదగిరిరావు, మట్టిపల్లి సైదులు, కోట  గోపి, జిల్లపల్లి నరసింహారావు, ధనియాకుల శ్రీకాంత్, దండ వెంకటరెడ్డి, వేల్పుల వెంకన్న, ములకలపల్లి రాములు, వల్లపు దాసు సాయికుమార్, రాంబాబు, మందడి రామ్ రెడ్డి, బచ్చల కూర రామ్ చరణ్, వినోద్ నాయక్, కమల లింగయ్య, నల్ల మేకల అంజయ్య, షేక్ జహంగీర్, నాగిరెడ్డి శేఖర్ రెడ్డి, దండ శ్రీనివాస్ రెడ్డి, సిపిఐ జిల్లా  నాయకులు ధూళిపాళ్ల ధనుంజయ నాయుడు, బూర వెంకటేశ్వర్లు, అనంతుల మల్లేశ్వరి, ఉప్పునూతల కోటమ్మ, ఖమ్మం పాటీ రాము, నిమ్మల ప్రభాకర్, రెమిడాల  రాజు, లత్తు, గోపగాని రవి, న్యూ డెమోక్రసీ  నాయకులు బొడ్డుశంకర్, పోలే బోయిన కిరణ్, కునుకుంట్ల సైదులు, పుల్లూరి సింహాద్రి, వీరబోయిన రమేష్, బొల్లె వెంకన్న, భీమిరెడ్డి, భరత్, రహీం, బండి రవి, ప్రజా పంద నాయకులు రాంజీ, వీరబాబు, మోష, బన్నీ, గులాం, సూరం రేణుక, బహుజన శ్రామిక రాజ్యం రాష్ట్ర కన్వీనర్ చామకూరి నర్సాగౌడ్, ఎల్ హెచ్ పి ఎస్ జిల్లా అధ్యక్షులు  ఎల్ హెచ్ పి ఎస్ జిల్లా అధ్యక్షులు నాగేందర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.