పుట్టపాక కే పట్టం

పుట్టపాక కే పట్టం
  • చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు  కాంగ్రెస్ కైవసం
  • బలపరీక్షలో 11 మంది కౌన్సిలర్లు గైర్హాజర్ 

ముద్ర ప్రతినిధి, వనపర్తి : వనపర్తి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ఏకగ్రీవం అయింది. శనివారం వనపర్తి మున్సిపల్ కార్యాలయంలో జరిగిన ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా ఆర్డిఓ పద్మావతి వ్యవహరించారు. సమావేశానికి కాంగ్రెస్, బిఆర్ఎస్, తెలుగుదేశం పార్టీకి చెందిన మొత్తం 22 మంది కౌన్సిలర్ ల తో పాటు ఎక్స్ అఫీషియో ఓటు కలిగిన ఎమ్మెల్యే తూడి మెగా రెడ్డి హాజరయ్యారు. మున్సిపల్ చైర్మన్ గా కాంగ్రెస్ లో చేరిన బిఆర్ఎస్ కౌన్సిలర్ పుట్టపాక మహేష్ ఎన్నికయ్యారు. 

వైస్ చైర్మన్ పదవి కోసం కాంగ్రెస్ పార్టీలో చేరిన బి ఆర్ ఎస్ కౌన్సిలర్ పాకనాటి కృష్ణ నామినేషన్ దాఖలు చేశారు. రెండు పదవుల కోసం వీరు ఇద్దరే నామినేషన్లు దాఖలు చేయడం తో వారి ఎన్నిక ఏకగ్రీవం అయింది.మొత్తం 33 మంది కౌన్సిలర్లు ఉన్న మున్సిపల్ కౌన్సిల్లో బల నిరూపణ పరీక్షకు 11 మంది కౌన్సిలర్లు గైర్హాజర్ అయ్యారు. చైర్మన్ ఎన్నికకు 13వ వార్డ్ కౌన్సిలర్ పుట్టపాక మహేష్ నామినేషన్ వేయగా కౌన్సిలర్ వెంకటేష్,  సత్యం సాగర్ బలపరచారు. మిగతా కౌన్సిలర్లు, సభ్యులు ఆమోదం తెలిపారు. వైస్ చైర్మన్ పదవికి 20వ కౌన్సిలర్ పాకనాటి కృష్ణ నామినేషన్ వేయగా కౌన్సిలర్ భువనేశ్వరి ప్రతిపాదించడం జరిగింది.

మిగతా కౌన్సిలర్లు ఆమోదించడం జరిగింది. దీనితో చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. కొత్తగా ఎన్నికైన పుట్టపాక మహేష్, పాకనాటి కృష్ణ లచే రిటర్నింగ్ అధికారి పద్మావతి ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం నియామక పత్రాలు అందజేశారు. చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియలో టిఆర్ఎస్ పార్టీ చెందిన కౌన్సిలర్లు, కాగితల లక్ష్మీనారాయణ, మహమ్మద్ సమ్మద్, ఉంగులం అలేఖ్య, భారతి, కంచరవి, పెండెం నాగన్న యాదవ్, గట్టు యాదవ్, వాకిటి శ్రీధర్, కామరున్ ఈసా బేగం తోపాటు, కాంగ్రెస్ పార్టీకి చెందిన, బి. రమాదేవి. బొడ్డుపల్లి పద్మ  గైర్హాజరయ్యారు, కొత్తగా ఎన్నుకోబడిన  చైర్మన్, వై చైర్మన్ తో పాటు కౌన్సిలింగ్ సభ్యులను ఎమ్మెల్యే మెగా రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. మున్సిపల్ కార్యాలయం ముందు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున బాణాసంచ పేల్చి కొత్తగా ఎన్నుకోబడిన పూలమాలలతో నూతన సభ్యులను ఘనంగా సన్మానించి సంబరాలు జరుపుకున్నారు.