కొనసాగు....తున్న జిల్లా సర్వసభ్య సమావేశం....

కొనసాగు....తున్న జిల్లా సర్వసభ్య సమావేశం....
  • అధికారుల పనితీరును ప్రశ్నిస్తున్న ప్రజా ప్రతినిధులు...
  • కాంగ్రెస్ ప్రభుత్వంలో తొలి సమావేశం..
  • కృష్ణ రివర్ మేనేజ్మెంట్ బోర్డుపై తీర్మాణం..
  • ప్రజాప్రతినిధుల్లో కనిపించని ఉత్సహం...

ముద్ర ప్రతినిధి సూర్యాపేట:- రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వంలో సూర్యాపేటలో తొలి సర్వసభ్య సమావేశం జరుగుతోంది. జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గుజ్జ దీపిక యుగేందర్ రావు అధ్యక్షత జరుగుతున్న ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావు,రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, సీఈఓ సురేష్,వైస్ చైర్మన్ గోపగాని వెంకట నారాయణ గౌడ్ తో పలువురు జడ్పీటీసీలు, ఎంపిపిలు పాల్గొన్నారు.ఈ సమావేశంలో వివిధ శాఖల జిల్లా అధికారులు తమ శాఖ ఉద్యోగులు జరుగుతున్న పనితీరుపై ప్రజా ప్రతినిధులకు వివరిoచారు.ఈ సందర్భంగా అధికారుల పనితీరుపై పలువురు జడ్పీటీసీలు,ఎంపిపిలు అసహనం వ్యక్తం చేస్తూ ప్రశ్నల వర్షం కురిపించారు.ఇప్పటికైనా కొంతమంది అధికారులు తమ పనితీరును మార్చుకోకుంటే రానున్న వేసవి కాలం దృష్ట్యా ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అనంతరం కలెక్టర్, జడ్పీ చైర్ పర్సన్ మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులు సూచించే సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించి దృష్టి సారించాలని ఆదేశించారు. ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా చూడాలని అదికారులకు సూచించారు.ప్రతినిధులు అడిగే సమస్యలను అధికారులు నోట్ చేసుకోవాలని సూచించారు.కాగా బిఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోవడంతో ఎక్కువ సంఖ్యలో ఉన్న జడ్పీటీసీలు,ఎంపిపి లలో గత సభ్య సమావేశాల్లో కనిపించిన ఉత్సహం నేటి సమావేశంలో కనిపించక పోవడం విశేషం.కాగా కాంగ్రెస్ ప్రభుత్వం నూతనoగా అధికారం చేపట్టాక ఈ తొలి సర్వసభ్య సమావేశం కావడంతో ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది.

సాగర్ లో నీటి లభ్యత లేకుంటే ఉమ్మడి నల్లగొండ జిల్లా తాగునీటి సమస్య తప్పదు.. ఎంపి బడుగుల

కెఆర్ ఎంబి పరిధిలోకి తెలంగాణ నీటి ప్రాజెక్టులను తీసుకొని పోవద్దని రాజ్యసభ సభ్యలు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. నాగార్జున సాగర్ లో నీటి లభ్యత లేకపోవడం వలన వచ్చే వేసవి కాలంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా త్రాగునీటి సమస్య వచ్చే ప్రమాదం ఉందన్నారు.అందుకు సాగర్ ఎడమ కాలువ నుండి నీటిని వదిలి చెరువులను నింపాలని ఆయన కోరారు.పాలేరుకు వెళుతున్న నీటిని సాగర్ ఎడమ కాలువ పరిధిలోని మిర్యాలగూడ, హుజూర్ నగర్, కోదాడ నియోజక వర్గాల్లోని ఆయా గ్రామాలలో చెరువులు నింపాలని ఎంపి సూచించారు.మిషన్ భగీరథ పథకంలో పనుల నిమిత్తం ప్రతి నియోజకవర్గానికి  రూ.10 కోట్లు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ కు ఆయన విజ్ఞప్తి చేశారు.

కృష్ణ రివర్ మేనేజ్మెంట్ బోర్డుపై తీర్మాణం

కృష్ణ రివర్ మేనేజ్మెంట్ బోర్డు పరిధిలోకి నాగార్జున సాగర్,శ్రీశైలం ప్రాజెక్టులు వెళ్లడం వలన తెలంగాణ రాష్ట్రం తన హక్కులను కోల్పోతుందని,కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రాజెక్టులను కెఆర్ ఎంబి పరిధిలోకి తీసుకుని వెళ్లవద్దని ఈ సర్వసభ్య సమావేశంలో ఆయన ప్రతిపాదించిన తీర్మానాన్ని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గుజ్జ దీపిక యుగేందర్ రావు సభ్యుల పక్షాన ఆమోదింప జేసీనట్లు ఆమె వెల్లడించారు.