త్రాగునీటి సమస్య పరిష్కారానికె మొదటి ప్రాధాన్యత

త్రాగునీటి సమస్య పరిష్కారానికె మొదటి ప్రాధాన్యత
  • మున్సిపల్ చైర్మన్ బచ్చలకూరి ప్రకాష్ 

ముద్ర న్యూస్ నేరేడుచర్ల: నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలో వేసవికాలంలో నీటి ఎద్దడి నివారించడానికి త్రాగునీటి సమస్య పరిష్కారానికి మొదటి ప్రాధాన్యతనిస్తున్నట్లు మున్సిపల్ చైర్మన్ బచ్చలకూరి ప్రకాష్ అన్నారు. బుధవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన మున్సిపాలిటీ అత్యవసర సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ సంవత్సరం వర్షాభావ పరిస్థితులు నెలకొన్నందున భూగర్భ జలాలు అడుగంటి తాగునీటి సమస్య ఉత్పన్నం అయ్యే అవకాశం ఉన్నందున రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి కెప్టెన్ నల్లమద ఉత్తమ్ కుమార్ రెడ్డి తాగునీటి సమస్యలు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, తాగునీటి సమస్యలు తలెత్తకుండా ఎన్ని నిధులైనా మంజూరు చేయడానికైనా సిద్ధమని హామీ ఇచ్చినట్లు తెలిపారు. కౌన్సిలర్లు ఆయా వార్డులో అవసరమైన మంచినీటి బోర్లు పైపుల నిర్మాణం ట్యాంకుల ద్వారా నీటి సరఫరా తదితర సమస్యలు సమావేశం అధికారుల దృష్టికి తీసుకువచ్చి ప్రజలకు మంచినీటి ఇబ్బందులు తలెత్తకుండా సహకరించాలని కోరారు.కౌన్సిలర్ కొదమగుండ్ల సరిత మాట్లాడుతూ విద్యుత్ లైన్ లపై చెట్లను తొలగించాలని విద్యుత్ సిబ్బందిని అడిగితే మున్సిపాలిటీ సిబ్బంది ని అడగాలని సూచిస్తున్నారని ఎవరు తొలగించాలని ఆమె ప్రశ్నిస్తూ వెంటనే చెట్లను తొలగించి విద్యుత్ సరఫరా కు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.

కౌన్సిలర్ కొణతం చిన్న వెంక రెడ్డి మాట్లాడుతూ శాంతినగర్ నుండి కమలానగర్ వరకు గల రహదారిపై గుంతలను పూడ్చివేసి మున్సిపాలిటీ ప్రజలతో పాటు మండల ప్రజల ఇబ్బందులు తొలగించాలని కోరారు. కౌన్సిలర్ భాష మాట్లాడుతూ షేక్ బాషా మాట్లాడుతూ మిషన్ భగీరథ నీరు ట్యాంకులకు సరఫరా కావడం లేదని, విద్యుత్ బిల్లులు ఆలస్యంగా కొట్టడం వల్ల వినియోగదారులకు అత్యధిక బిల్లులు వచ్చి నష్టపోతున్నారని సకాలంలో బిల్లును కొట్టి వినియోగదారులకు నష్టం కలగకుండా చూడాలని, మున్సిపాలిటీ పరిధిలో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉందని పరిష్కరించాలని ఆయన సమావేశం దృష్టికి తెచ్చారు. పదవవార్డ్ కౌన్సిలర్ మాట్లాడుతూ పదో వార్డులో రెండు మంచినీటి బోర్లు వేయాలని ప్రస్తుత వేసవి కాలంలో వాటర్ ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేయాలని కోరారు.రెండో వార్డ్ కౌన్సిలర్ నాగయ్య విద్యుత్ సమస్యలు పరిష్కరించాలని కోరారు. మున్సిపాలిటీ పరిధిలో తాగునీటి సమస్యల పరిష్కారం కోసం 15 వార్డుల్లో 19 లక్షల రూపాయలతో చేపట్టనున్న పనులకు సమావేశం ఆమోదం తెలిపింది.ఈ సమావేశంలో వైస్ చైర్మన్ అలక సరిత సైదిరెడ్డి, కమిషనర్ అశోక్ రెడ్డి, కౌన్సిలర్లు కొదమగుండ్ల సరిత, కొణతం చిన్న వెంకటరెడ్డి, రణపంగ నాగయ్య, షేక్ షహనాజ్, షేక్ బాషా, బానోత్ లలిత, తాళ్లూరు సాయి ,నూకలసుగుణమ్మ, కుంకు సులోచన ,వేమూరి నాగవేణి తదితరులు పాల్గొన్నారు.