కోటి మొక్కల నాటడమే  ప్రభుత్వ లక్ష్యం

కోటి మొక్కల నాటడమే  ప్రభుత్వ లక్ష్యం
  • వృక్షాల వల్ల పర్యావరణ పారిశుధ్యం కలుగుతుంది
  • మొక్కలు నాటి వాటిని సంరక్షించాలి
  • ఎంపీపీ గుండగాని కవిత

తుంగతుర్తి ముద్ర:-స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు ఉత్సవాల్లో భాగంగా కోటి మొక్కలు నాటే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని ఎంపిపి గుండగాని కవిత అన్నారు .శనివారం మండల పరిధిలోని గానుబండ గ్రామంలో  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం  చేపట్టిన హరితర కార్యక్రమానికి  ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు . ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన హరితహారం కార్యక్రమంలో  ప్రతి ఒక్కరూ భాగస్వాములై మొక్కలు నాటి వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందన్నారు. మొక్కలు పెంచడం ద్వారా  పర్యావరణం పరిరక్షణ అలాగే పరిశుభ్రమైన గాలి లభిస్తుందని అన్నారు. వర్షాలు సకాలంలో కురుస్తాయని అన్నారు.ఈ సందర్భంగా గానుగొండ గ్రామంలో సర్పంచ్ నల్లు రామచంద్రారెడ్డి తో కలిసి మొక్కలు నాటారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో భీమ్ సింగ్ నాయక్, ఏపీఓ కృష్ణయ్య, గ్రామ కార్యదర్శి కృష్ణ, బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు తాటికొండ సీతయ్య ,నాయకులు గుండగాని రాములు గౌడ్,  ,ఉప సర్పంచ్ పోలేపాక పరమేష్, ఈసీ బిక్షం, టెక్నికల్ అసిస్టెంట్ సురేష్, ఫీల్డ్ అసిస్టెంట్ స్రవంతి, గుండగాని శ్రీను,గుండగాని దుర్గయ్య, సోమయ్య వార్డు సభ్యులు, నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.