సంక్షేమ పథకాలతో చేనేతలకు అండగా నిలిచిన ప్రభుత్వం

సంక్షేమ పథకాలతో చేనేతలకు అండగా నిలిచిన ప్రభుత్వం

ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి

ముద్ర, భూదాన్ పోచంపల్లి : రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలతో చేనేతలకు అండగా నిలిచిందని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి అన్నారు. శనివారం పోచంపల్లి చేనేత సహకార సంఘం లిమిటెడ్ 67వ వార్షిక, 65వ సర్వసభ్య సాధారణ మహాసభ లో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణా ప్రభుత్వం వచ్చాకనే రాష్ట్రం లో చేనేత ఆత్మహత్యలు చాలా వరకు తగ్గాయని అలాగే కాటన్ వస్త్రాల ఉత్పత్తి మరింత పెరగాయని అన్నారు. ఆత్మహత్యలు చేసుకున్న చేనేత కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం నుంచి వచ్చిన ఎక్స్ గ్రేషియా చెక్కులను అందించారు. ఈ కార్యక్రమంలో చేనేత సహకార సంఘం సభ్యులు పాల్గొన్నారు.