తల్లి నీకు పాదాభివందనం... ఫలించిన తల్లి శ్రమ... 7.5 మార్కులతో ఉత్తీర్ణత

తల్లి నీకు పాదాభివందనం... ఫలించిన తల్లి శ్రమ... 7.5 మార్కులతో ఉత్తీర్ణత

ముద్ర ప్రతినిధి, నిర్మల్: దివ్యాంగుడైన కొడుకును పరీక్షలకు సిద్ధం చేసి వ్రాయించిన ఆ తల్లి పడ్డ శ్రమ ఫలించింది. పదోతరగతి పరీక్షల్లో ఆ విద్యార్థి 7.5 పాయింట్లతో పరీక్ష పాసయ్యాడు. నిర్మల్ జిల్లా చించోలి(బి) కి చెందిన దివ్యాంగుడైన పదో తరగతి విద్యార్థి చరణ్. చిన్నప్పుడే పోలియో కారణంగా కాళ్ళు రెండూ చచ్చుపడిపోయాయి. ఒకరి ఆధారం లేకుండా కదల లేడు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ విద్యార్థికి తల్లి తోడైంది. తన కొడుకుకు చదవాలని ఆసక్తి ఉన్న కారణంగా ఎలాగైనా పరీక్షలు రాయించాలనుకుంది. ప్రతి రోజూ ఆటోలో తీసుకొచ్చి హాల్లోకి ఎత్తుకెళ్లి దింపి వెళ్ళేది. పరీక్షయ్యాక తీసుకెళ్లేది. ఇంత శ్రమించి ఆ తల్లి పడ్డ తపన ఫలించింది. పదోతరగతి పరీక్షల్లో 7.5 మార్కులు సాధించి ఉత్తీర్ణుడవటంతో ఆ తల్లి ఆనందానికి అంతులేకుండా పోయింది.