పిలిచిన పలకవేమయ్య ఓ జంగమయ్య పాట సిడి ఆవిష్కరణ

పిలిచిన పలకవేమయ్య ఓ జంగమయ్య పాట సిడి ఆవిష్కరణ

ముద్ర.వీపనగండ్ల:- అక్షయ రికార్డింగ్ స్టూడియో సమర్పణలో యూట్యూబ్ ఛానల్ కోసం ఉండేకోటి కృష్ణయ్య రాసిన ”“పిలిచిన పలకవేమయ్యా ఓ జంగమయ్య“ అనే పాటను,తెలంగాణ దండోరా రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు, జానపద కళాకారుడు మీసాల రాము గానం చేసిన పాట సిడి ని గురువారం మండల కేంద్రంలోని వీపనగండ్ల బస్టాండ్ ఆవరణలో మండల రైతుబంధు సమితి మాజీ అధ్యక్షులు కృష్ణయ్య, రిటైర్డ్ విద్యుత్ ఏఇ మాజీ సర్పంచ్ గంగిరెడ్డి లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ గంగిరెడ్డి మాట్లాడుతూ గ్రామానికి చెందిన మండల రైతుబంధు సమితి మాజీ అధ్యక్షులు మాందాపురం మల్లయ్య శివుడి భక్తుడిగా నటించటం చాలా అదృష్టమని అన్నారు, ఇప్పటికే మల్లయ్య ప్రముఖ ఈటీవీ ఛానల్ వారు నిర్మించిన యమలీల సీరియల్ లో నటించారని, నటుడుగా, రాజకీయ నాయకుడిగా ఏదగటం సంతోషంగా ఉందని అన్నారు.

గ్రామంలోని పలువురు కళాకారులు వివిధ రంగాలలో తమ ప్రతిభను చాటి రాష్ట్రస్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారు ఉన్నారని అన్నారు. ఈ పాటను గానం చేసిన మీసాల రాము ఇప్పటికే పలు పాటలను పాడి సాంస్కృతిక కళారూపాల ద్వారా యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రజలకు పరిచయం చేశారని గుర్తు చేశారు. గత నాలుగు రోజుల క్రితం రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చేతుల మీదుగా" శ్రీశైలం మల్లన్న దారి చూపగా రావా స్వామి" అనే పాటను కూడా విడుదల చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి మాజీ అధ్యక్షులు ముంత మల్లయ్య యాదవ్, కాంగ్రెస్ పార్టీ మండల కిసాన్ అధ్యక్షులు వెంకటరెడ్డి, సిపిఎం పార్టీ మండల కార్యదర్శి బాల్ రెడ్డి, రైతు కమిటీ అధ్యక్షులు వెంకటయ్య, నాయకులు గోపి, మహేష్ నాయుడు, సంఘం వెంకటయ్య, గంగులు, కళాకారుడు నరసింహ, ఆర్ఎంపీ వైద్యులు శాంతయ్య తదితరులు ఉన్నారు.