కంటి వెలుగు విజయవంతం

కంటి వెలుగు విజయవంతం

మున్సిపల్ చైర్మన్ గెల్లి అర్చన రవి.

హుజూర్నగర్ ,ముద్ర: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన కంటి వెలుగు కార్యక్రమం హుజూర్నగర్ మున్సిపాలిటీ పరిధిలో జనవరి 18 నుంచి నేటి వరకు వివిధ వార్డ్ ల్లో విజయవంతంగా నిర్వహించి నేటితో ముగిసినట్లు హుజూర్నగర్ మున్సిపల్ చైర్మన్ గెల్లి అర్చన రవి తెలిపారు. శుక్రవారం పట్టణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ  హుజూర్నగర్ మున్సిపాలిటీ పరిధిలో తమ టీం ద్వారా 17 వార్డులలో 10331 మందిని పరీక్షించి 2172 మందికి నిర్ధారించిన కంటి అద్దాలను అందజేయడం 787 మందికి ఆర్డర్ ద్వారా కళ్ళజోలను అందించి 1863 మందిని కంటి ఆపరేషన్లకు రిఫర్ చేసినట్లు కంటివెలుగు క్యాంపు కోఆర్డినేటర్ ఇందిరాల రామకృష్ణ తెలియజేశారు. గత ఐదు నెలలుగా  హుజూర్నగర్ మున్సిపాలిటీలో సేవలందించిన కంటివెలుగు సిబ్బందికి మున్సిపల్ చైర్మన్ అర్చన రవి ,వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వరరావు కృతజ్ఞతలు తెలిపి వారిని సన్మానించారు.ఈ కార్యక్రమంలో క్యాంప్ కో ఆర్డినేటర్ ఇందిరాలరామకృష్ణ, డాక్టర్ సుష్మ,ఆప్తమెట్రీషియన్ మల్లిక, డాటా ఎంట్రీ ఆపరేటర్ శివ, ఏ ఎన్ ఎం లు హైమావతి, కవిత,ఆశా కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.