అదుపు తప్పి లారీ బోల్తా

అదుపు తప్పి లారీ బోల్తా

భూదాన్ పోచంపల్లి,ముద్ర:- అదుపుతప్పి లారీ బోల్తా పడిన ఘటన భూదాన్ పోచంపల్లి మండల పరిధిలోని జగత్ పల్లి గ్రామ శివారులో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పిల్లాయిపల్లి నుండి పోచంపల్లికి వెళ్తున్న లారీ జగత్ పల్లి గ్రామ శివారులో గల కల్వర్టుపై ఎదురుగా కారు రావడంతో కల్వర్టు కూలి అదుపుతప్పి లారీ బోల్తా పడింది. శిధిలావస్థకు చేరిన కల్వర్టుకు మరమ్మతులు చేయాలని గతంలో ఎన్నోసార్లు అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకున్న వారే కరువయ్యారని స్థానికులు వాపోతున్నారు. తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి ప్రాణ నష్టం జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.