నల్లబెల్లం, పటిక తయారీదారులను గుర్తించి వెంటనే వారిని బైండోవర్ చేయించాలి.

నల్లబెల్లం, పటిక తయారీదారులను గుర్తించి వెంటనే వారిని బైండోవర్ చేయించాలి.

DSP వెంకటేశ్వర్ రెడ్డి

హుజూర్నగర్, ముద్ర:గురువారం హుజూర్నగర్ పట్టణ పోలీస్ స్టేషన్లో DSP వెంకటేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో హుజూర్నగర్ నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాలకు చెందిన ఎస్ఐలతో పాటు హుజూర్నగర్ స్టేషన్ ఎక్సైజ్ సిఐ , ఎస్సై లతో కార్యాలయంలో ఎక్సైజ్ క్రైమ్ కు ఆర్డినేషన్ మీటింగ్ నిర్వహించడం జరిగింది.

ఈ సమావేశంలో DSP వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ సారా తయారీదారులను రవాణా దారులను ముఖ్యంగా బెల్లం పట్టిక సప్లై దారులను గుర్తించి వారిని తక్షణమే బైండోవర్ చేయించాలని ఇకనుండి వారిపై నిఘా ఉంచి ఎక్సైజ్ శాఖతో కలిసి జాయింట్ గా దాడులు నిర్వహించి కేసులు నమోదు చేయాలని ఆదేశించారు.
ముఖ్యంగా అన్ని స్టేషన్ పరిధిలో సారా తయారీకి నల్లబెల్లం ,పట్టిక సరఫరా చేసే వ్యక్తులు కిరాణా షాపు యజమాను లను తీవ్రంగా హెచ్చరించాలని ఉద్దేశపూర్వకంగా నల్ల బెల్లం, పట్టిక సప్లై చేసే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు.