స్థానిక నేతల తీరుతో మంత్రి సీతక్కకు అవమానం...

స్థానిక నేతల తీరుతో మంత్రి సీతక్కకు అవమానం...

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లా భైంసా లో ఏర్పాటు చేసిన మంత్రి సీతక్క కార్యక్రమాన్ని మీడియా బాయికాట్ చేసింది. ఆదిలాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్చార్జి మంత్రి సీతక్క నియోజకవర్గాల వారీగా సమీక్షా సమావేశాలు జరుపుతున్న విషయం తెలిసిందే. శనివారం ఖానాపూర్, నిర్మల్ నియోజకవర్గాల్లో సమీక్ష నిర్వహించారు. ఆదివారం భైంసా లోని గౌరీ శంకర్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మీడియా కోసం ఎలాంటి ఏర్పాట్లు చేయకపోగా కనీసం దిద్దుబాటు చర్యలు కూడా తీసుకోనందుకు నిరసనగా కార్యక్రమాన్ని బహిష్కరించారు. స్థానిక నాయకులు వ్యవహరిస్తున్న తీరుపై వారు నిరసన వ్యక్తం చేశారు.