యువకుడి హత్య?

యువకుడి హత్య?

పాలకీడు,ముద్ర ప్రతినిధి:- మండలంలోనీ గుడుగుంట్లపాలెం గ్రామంలో హత్య జరిగింది.గ్రామస్థుల వివరాల ప్రకారం.మూసిఒడ్డు సింగారం గ్రామానికి చెందిన ఆరుట్ల చిరంజీవి గుడుగుంట్ల పాలెం గ్రామానికి చెందిన అరుణను ప్రేమ వివాహం చేసుకున్నాడు.వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.ఇటీవల ఇద్దరికీ తరచూ గొడవలు జరగుతున్న నేపథ్యంలో అరుణ తమ తల్లిగారి ఊరు ఐన గుడుగుంట్ల పాలెంలో వుంటుంది కాగా నిన్న రాత్రి అమే వద్దకు వచ్చిన భర్త చిరంజీవిని భార్య తరపు బంధువులు విచక్షణా రహితంగా కొట్టడంతో. తీవ్రంగా గాయపడ్డ చిరంజీవి కొంతసేపటికి మరణించాడు.విషయం తెలుసుకున్న స్థానిక సి ఐ చరమంద రాజు, ఎస్సై లక్ష్మి నర్సయ్య, ఘటనా స్థలికి చేరుకుని  పరిశీలించారు.మృతుడి తరుపున బంధువుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకునీ .మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.కాగా హతులు స్థానిక పిఎస్ లో లొంగిపోయినట్లు సంచారం.అధికారికంగా అస్సలు విషయాలు తెలియాల్సి వుంది.