మిల్లర్ల అభివృద్ధి కోసం రైస్ మిల్లార్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పాటుపడాలి

మిల్లర్ల అభివృద్ధి కోసం రైస్ మిల్లార్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పాటుపడాలి
  • ఘనంగా సూర్యాపేట జిల్లా రైస్ మిల్లర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం


ముద్ర ప్రతినిధి సూర్యాపేట:-మిల్లర్ల అభివృద్ధికి సంక్షేమానికి సూర్యాపేట జిల్లా రైస్ మిల్లర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కృషి చేయాలని రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సహాయ కార్యదర్శి మొరిశెట్టి శ్రీనివాస్ అన్నారు. ది సూర్యాపేట జిల్లా రైస్ మిల్లర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం  స్థానిక రైస్ మిల్లర్స్ అసోసియేషన్ భవనం లో నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించి ఆయన మాట్లాడారు. కలసికట్టుగా ఉంటూ ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కరించుకొని సంఘంలో, సమాజంలో విజయవంతంగా ముందుకు సాగాలన్నారు. అనంతరం రైస్ మిల్లర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులుగా బోనాల రవీందర్, అధ్యక్షులుగా వెంపటి మధుసూదన్, ఉపాధ్యక్షులుగా కొండమీది గోవిందా రావు, ప్రధాన కార్యదర్శిగా దొంగరి వెంకటేశ్వర్లు, సహాయ కార్యదర్శిగా సుందరి నాగేశ్వర్ రావు, కోశాధికారిగా పస్య నవీన్ లు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో రైస్ మిల్లర్లు అంగిరేకుల నాగార్జున,  బొలిశెట్టి లక్ష్మి నరసింహ రావు, బ్రహ్మదేవర సీతయ్య ,  గవ్వ ప్రభాకర్, కొంపెల్లి నర్సిరెడ్డి, నీల సత్యనారాయణ, కసం జగన్ తదితరులు పాల్గొన్నారు.