ఏటీఎం లో దొంగతనానికి యత్నించిన వ్యక్తి పట్టివేత

ఏటీఎం లో దొంగతనానికి యత్నించిన వ్యక్తి పట్టివేత

ముద్ర ప్రతినిధి, నిర్మల్: శనివారం  తెల్లవారుజామున నిర్మల్ పట్టణం లోని కెనరా బ్యాంక్ ఏటీఎం లో దొంగతనానికి యత్నించిన వ్యక్తిని పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. దొంగతనానికి యత్నిస్తున్న విషయాన్ని గుర్తించిన బ్యాంక్ మేనేజర్ 100 కు కాల్ చేసి డాక్టర్ లేన్  ఏటీఎం లో ఎవరో గుర్తుతెలియని వ్యక్తి దొంగతనానికి ప్రయత్నిస్తున్నాడని తెలిపారు.

తక్షణమే రాత్రి పెట్రోలింగ్ డ్యూటీ లో ఉన్న ఇన్స్పెక్టర్ ప్రేమ్ కుమార్  అక్కడికి వెళ్లి సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించారు.అనంతరం ఫుటేజ్ ఆనవాళ్ళ మేరకు దగ్గర ప్రదేశాలలో వెతుకుతున్న క్రమంలో బస్ స్టాండ్ దగ్గర  వెల్మల్ బొప్పారం గ్రామానికి చెందిన కుంచం గంగాధర్ ను నిందితునిగా  గుర్తించి పట్టుకొన్నారు. 100 డయల్  కాల్ కు తక్షణమే స్పందించి చాకచక్యంగా దొంగని పట్టుకొన్న ఇన్స్పెక్టర్ ప్రేమ్ కుమార్ ను జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల అభినందించారు.